Telugu Global
Cinema & Entertainment

కిన్నెరసాని మాయలో మెగా అల్లుడు

మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ (అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో రీసెంట్ గా కొత్త సినిమా లాంఛ్ అయింది. కల్యాణ్ దేవ్ కు ఇది మూడో సినిమా కాగా.. రమణతేజకు రెండో మూవీ. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. కిన్నెర‌‌సాని టైటిల్ లుక్ పోస్ట‌ర్ లో సినిమా థీమ్ చెప్పేలా ప్ర‌శాంత‌మైన స‌ముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేశారు. […]

కిన్నెరసాని మాయలో మెగా అల్లుడు
X

మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ (అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో రీసెంట్ గా కొత్త సినిమా లాంఛ్ అయింది. కల్యాణ్ దేవ్ కు ఇది మూడో సినిమా కాగా.. రమణతేజకు రెండో మూవీ. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.

కిన్నెర‌‌సాని టైటిల్ లుక్ పోస్ట‌ర్ లో సినిమా థీమ్ చెప్పేలా ప్ర‌శాంత‌మైన స‌ముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేశారు. అలానే కిన్నెర‌సాని టైటిల్ కి క్యాప్ష‌న్ గా అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్ (హ‌ద్దు లేక‌పోవ‌డం ప్ర‌మాద‌క‌రం) అనే సంస్కృత వాక్యాన్ని కూడా జోడించారు.

ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది. ఛ‌లో, భీష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  14 Nov 2020 5:35 AM GMT
Next Story