Telugu Global
Cinema & Entertainment

నాని మరో సినిమా ప్రకటించాడు

హీరో నాని మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. దీపావళి కానుకగా తన కొత్త సినిమా వివరాల్ని బయటపెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. నిజానికి ఈ ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే. బ్రోచేవారెవరురా సినిమా సక్సెస్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వివేక్ ఆత్రేయను లాక్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన కథతో నానిని మెప్పించాడు ఆత్రేయ. అలా ప్రాజెక్టు ఫిక్స్ అయింది. ఈరోజు […]

నాని మరో సినిమా ప్రకటించాడు
X

హీరో నాని మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. దీపావళి కానుకగా తన కొత్త సినిమా వివరాల్ని బయటపెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

నిజానికి ఈ ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే. బ్రోచేవారెవరురా సినిమా సక్సెస్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వివేక్ ఆత్రేయను లాక్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన కథతో నానిని మెప్పించాడు ఆత్రేయ. అలా ప్రాజెక్టు ఫిక్స్ అయింది. ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ మొత్తం ప్రకటనలో ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఉందంటే అది హీరోయిన్ మాత్రమే. అవును.. ఈ సినిమాతో నజ్రియా ఫహాద్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఈమె మలయాళీ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక లేదా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆశ్చర్యంగా కొత్తమ్మాయికి చోటిచ్చారు.

First Published:  13 Nov 2020 11:15 PM GMT
Next Story