Telugu Global
National

బీహార్​లో ఓటమి... తమిళనాడు కాంగ్రెస్​ కొంపముంచిందా?

ఇటీవల జరిగిన బీహార్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. మహాఘట్ ​బంధన్​ పేరుతో అక్కడి ఆర్​జేడీతో పొత్తుపెట్టుకుంది. అయితే కూటమిలోని తన మిత్రపక్షమైన ఆర్​జేడీకి గణనీయమైన స్థానాలు రాగా కాంగ్రెస్​ పోటీచేసిన స్థానాల్లో ఓటమి చవిచూసింది. అయితే కాంగ్రెస్​తో పోత్తు పెట్టుకోకపోయిఉంటే తాము అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఆర్​జేడీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం బీజేపీకి లాభించిందని.. కాంగ్రెస్​ పోటీచేసిన చాలా స్థానాల్లో బీజేపీ గెలుపొందిందని ఆర్​జేడీ నేతలు భావిస్తున్నారు. బీహార్​లో […]

బీహార్​లో ఓటమి... తమిళనాడు కాంగ్రెస్​ కొంపముంచిందా?
X

ఇటీవల జరిగిన బీహార్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. మహాఘట్ ​బంధన్​ పేరుతో అక్కడి ఆర్​జేడీతో పొత్తుపెట్టుకుంది. అయితే కూటమిలోని తన మిత్రపక్షమైన ఆర్​జేడీకి గణనీయమైన స్థానాలు రాగా కాంగ్రెస్​ పోటీచేసిన స్థానాల్లో ఓటమి చవిచూసింది. అయితే కాంగ్రెస్​తో పోత్తు పెట్టుకోకపోయిఉంటే తాము అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఆర్​జేడీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం బీజేపీకి లాభించిందని.. కాంగ్రెస్​ పోటీచేసిన చాలా స్థానాల్లో బీజేపీ గెలుపొందిందని ఆర్​జేడీ నేతలు భావిస్తున్నారు. బీహార్​లో ఆర్​జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్​ 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీచేసి కేవలం 19 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. దీంతో మహాఘట్​బంధన్​ ఓడిపోయింది. కాంగ్రెస్​ ఓటమితో ఆర్​జేడీ నష్టపోయింది.

ఈ క్రమంలో బీహార్​ ఎన్నికల ఫలితం తమిళనాడులో కాంగ్రెస్​ కొంప ముంచేటట్టు ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. అయితే అక్కడ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతితో ఆ పార్టీ చతికిల బడింది. దానికి తోడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్​సెల్వం ప్రజా బలం ఉన్న నాయకులు కారు. ఈ సారి ఎన్నికల్లో అక్కడ డీఎంకే ఘనవిజయం సాధించడం ఖాయమని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ కూడా డీఎంకే తన మిత్రమపక్షమైన కాంగ్రెస్​తో పోటీచేయనున్నది.

బీహార్ ఫలితంపై డీఎంకే ఆందోళన

ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్​కు ఎక్కువ సీట్లు ఇస్తే బీహార్​ సీన్​ రిపీట్​ అయి తాము ఓడిపోతామేమోనని డీఎంకే నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కాంగ్రెస్​కు వీలైనన్నీ తక్కువ సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. బీహార్​ పరిస్థితి తమిళనాట ఏర్పడకూడదనే డీఎంకే అధిష్ఠానవర్గం భావిస్తున్నది. ఈ సారి కాంగ్రెస్​కు గతం కంటే తక్కువ సీట్లను మాత్రమే కేటాయించాలని చూస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధిష్ఠానవర్గం కాంగ్రెస్​కు 40 సీట్లు కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది.

ఈ కారణంగా డీఎంకే 90 స్థానాల్లో గెలిచినా కాంగ్రెస్​ ఘోరపరాజయం కారణంగా మెజారిటీ లేక అధికారంలోకి రాలేకపోయింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొనే డీఎంకే కాంగ్రెస్​కు సీట్లు కేటాయించే విషయమై కొద్ది నెలలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 20 సీట్లు మాత్రమే కేటాయించాలని డీఎంకే సీనియర్​ నేలు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్​ను కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్​ ఓటుబ్యాంక్​ నుంచి డీఎంకే అభ్యర్థులకు ఓట్లు పడటం లేదని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించి కాంగ్రెస్​కు సీట్లను కేటాయించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా స్టాలిన్​కు వారు సూచిస్తున్నారు

కాంగ్రెస్​ ఏమంటోంది?

గత ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించడానికి కాంగ్రెస్​ దోహదం చేసిందని తమిళనాడు కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. లోక్​సభ ఎన్నికల్లో తేని నియోజకవర్గం సహా అన్ని స్థానాల్లోనూ డీఎంకే కూటమి అభ్యర్థులు గెలిచారని.. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్​ పార్టీ ఇమేజ్​ బాగా పనిచేసిందని పార్టీ నేతలు వాదిస్తున్నారు.

బీహార్​ ఎన్నికల ఫలితాను పరిగణనలోకి తీసుకొని డీఎంకే కూటమిలో తమ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించాలనుకోవడం తగదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోని రావడం ఖాయమని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​కు మునపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తే తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్​ నాయకులు డీఎంకే అధిష్ఠానవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీ ఓటమి చెందుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీకి ఎక్కవ సీట్లు ఇస్తే తమ గెలుపునకు తామే అడ్డుకట్ట వేసుకున్నట్టవుతుందని డీఎంకే సీనియర్​ నేతలు స్టాలిన్​ ను హెచ్చరిస్తున్నారు. ఈ సారి తమిళనాడులో డీఎంకే నేతలు కాంగ్రెస్​కు కేవలం 20 లోపే సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

First Published:  14 Nov 2020 5:08 AM GMT
Next Story