Telugu Global
Cinema & Entertainment

నిరాశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

దసరాకు వకీల్ సాబ్ టీజర్ వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దసరాకు రాలేదు కాబట్టి దీపావళికి వస్తుందని అనుకున్నారు. కానీ దీపావళికి కూడా టీజర్ లేదని తేలిపోయింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు పవన్ ఫ్యాన్స్. దీపావళికి టీజర్ పక్కాగా వస్తుందని భావించి, దాదాపు 2 వారాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా స్టార్ట్ చేశారు పవన్ ఫ్యాన్స్. తీరా ఆ రోజు వచ్చేసరికి టీజర్ లేదని తెలిసి చాలా బాధపడుతున్నారు. ఇంతకీ టీజర్ ఎందుకు రాలేదు? దీనికి […]

నిరాశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
X

దసరాకు వకీల్ సాబ్ టీజర్ వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దసరాకు రాలేదు కాబట్టి దీపావళికి వస్తుందని అనుకున్నారు. కానీ దీపావళికి కూడా టీజర్ లేదని తేలిపోయింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు పవన్ ఫ్యాన్స్. దీపావళికి టీజర్ పక్కాగా వస్తుందని భావించి, దాదాపు 2 వారాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా స్టార్ట్ చేశారు పవన్ ఫ్యాన్స్. తీరా ఆ రోజు వచ్చేసరికి టీజర్ లేదని తెలిసి చాలా బాధపడుతున్నారు.

ఇంతకీ టీజర్ ఎందుకు రాలేదు? దీనికి కారణం ఒకటే. వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సంక్రాంతికి రిలీజ్ చేద్దామా లేక సమ్మర్ కు వద్దామా అనే డైలమాలో దిల్ రాజు పడిపోయాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వకుండా టీజర్ రిలీజ్ చేయడం యూనిట్ కు ఇష్టం లేదు. అందుకే టీజర్ రెడీగా ఉన్నప్పటికీ దీపావళికి రిలీజ్ చేయడం లేదు.

వచ్చేనెలలో సినిమా రిలీజ్ డేట్ పై ఓ అవగాహనకు రాబోతున్నాడు దిల్ రాజు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు, పూర్తిస్థాయిలో ఎప్పట్నుంచి అందుబాటులోకి వస్తాయనే అంశాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ వెంటనే టీజర్ కూడా రిలీజ్ అవుతుంది.

First Published:  14 Nov 2020 3:00 AM GMT
Next Story