Telugu Global
Cinema & Entertainment

సూపర్ స్టార్ దీపావళి స్టిల్స్

హీరోలంతా ఈ దీపావళి రోజున శుభాకాంక్షలు అందించి ఊరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం మరో అడుగు ముందుకేశారు. టపాసులు కాలుస్తూ.. కుటుంబ సమేతంగా ఫొటోలు దిగి వాటిని పోస్టు చేశారు. సందర్భం ఏదైనా సింపుల్ గా ఉండడం రజనీకాంత్ స్టయిల్. ఈ దీపావళి రోజున కూడా ఆయన అంతే సాధారణంగా ఉన్నారు. సంప్రదాయబద్ధంగా తెల్ల చొక్కా, పంచె కట్టుకొని టపాసులు కాల్చారు. రజనీకాంత్ తో పాటు ఆమె భార్య లత, కూతురు సౌందర్య, ఆమె భర్త, […]

సూపర్ స్టార్ దీపావళి స్టిల్స్
X

హీరోలంతా ఈ దీపావళి రోజున శుభాకాంక్షలు అందించి ఊరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం మరో అడుగు ముందుకేశారు. టపాసులు కాలుస్తూ.. కుటుంబ సమేతంగా ఫొటోలు దిగి వాటిని పోస్టు చేశారు.

సందర్భం ఏదైనా సింపుల్ గా ఉండడం రజనీకాంత్ స్టయిల్. ఈ దీపావళి రోజున కూడా ఆయన అంతే సాధారణంగా ఉన్నారు. సంప్రదాయబద్ధంగా తెల్ల చొక్కా, పంచె కట్టుకొని టపాసులు కాల్చారు. రజనీకాంత్ తో పాటు ఆమె భార్య లత, కూతురు సౌందర్య, ఆమె భర్త, కొడుకు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

ఇక దీపావళి సందర్భంగా మరోసారి రజనీకాంత్ ఇంటికి అభిమానుల తాకిడి పెరిగింది. తనను చూడ్డానికి, శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ మేడపై నుంచి ధన్యవాదాలు తెలిపారు రజనీకాంత్.

ప్రస్తుతం ఈ హీరో ‘అన్నాత్తై’ అనే సినిమా చేస్తున్నారు. కీర్తిసురేష్, నయనతార, మీన, ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను శివ డైరక్ట్ చేస్తున్నాడు.

First Published:  15 Nov 2020 9:25 AM GMT
Next Story