Telugu Global
National

తిరుపతి బరిలో హోదా సెగలు...

ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. తిరుపతి వేదికపైనే నరేంద్రమోదీ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాటిచ్చారు. అదే తిరుపతిలో.. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిన బీజేపీని పాచిపోయిన లడ్డూల్లాంటి ప్యాకేజీ ఇచ్చారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం రెండు పార్టీలు ప్రత్యేక హోదాపై నోరు మెదిపే పరిస్థితి లేదు. హోదా ఇవ్వలేమని ఈపాటికే […]

తిరుపతి బరిలో హోదా సెగలు...
X

ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. తిరుపతి వేదికపైనే నరేంద్రమోదీ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాటిచ్చారు. అదే తిరుపతిలో.. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిన బీజేపీని పాచిపోయిన లడ్డూల్లాంటి ప్యాకేజీ ఇచ్చారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.

ప్రస్తుతం రెండు పార్టీలు ప్రత్యేక హోదాపై నోరు మెదిపే పరిస్థితి లేదు. హోదా ఇవ్వలేమని ఈపాటికే బీజేపీ తేల్చి చెప్పింది. హోదా అడగలేం అని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన కాడె పడేసింది. అయితే ఏపీ ప్రజలు మాత్రం హోదాపై ఆశలు వదులుకోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు, అదే ఆశతో గంపగుత్తగా వైసీపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టారు. అందులో తిరుపతి ఒకటి. మరిప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనే అంశం తెరపైకి వస్తే బీజేపీ-జనసేన పరిస్థితి ఏంటి? మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే, తిరుపతిలో ఆడిన మాట తప్పామని ఒప్పుకుంటూనే రెండు పార్టీలు ప్రజల్ని ఓట్లు అడగగలవా? దుబ్బాక గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో మరుసటి రోజునుంచే తిరుపతిలో మకాం వేసిన కీలక నేతలు ప్రత్యేక హోదా డిమాండ్ నుంచి ఏ విధంగా తప్పించుకోగలరు? బీజేపీ నేతలకి ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తూ ఉండొచ్చు కానీ, స్థానిక సమస్యలను దాటవేసి ఓట్లు అడగాలంటే ఏ పార్టీకయినా కష్టమే. పాకిస్తాన్ కి బుద్ది చెప్పాం, చైనా తాట తీశాం, బీహార్ లో గెలిచాం, దుబ్బాకలో అధికార పార్టీని నలిపేశాం.. అంటూ ఎన్ని చెప్పినా తిరుపతి ఓటర్లను ఆ అంశాలు ప్రభావితం చేయగలవా? రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ 2014లోనే ఏపీలో జీరో అయిపోయింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి మరీ ఉసూరుమనిపించిన ద్రోహానికి 2019లో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది.

కాంగ్రెస్ కి ఆ పాప ప్రక్షాళణ చేసుకోవడం అసాధ్యం, హోదా ఇవ్వకుండా ఎన్ని ప్రత్యామ్నాయాలు చెప్పినా బీజేపీ ఏపీకి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చాలనుకోవడం అంతకంటే అసాధ్యం. అందుకే హోదా అంశం అంటేనే.. తెగ ఇదైపోతున్నారు బీజేపీ నేతలు. తిరుపతి ఉప ఎన్నిక సన్నాహక సభల్లో.. ఈపాటికే ఈ విషయంపై చర్చ జరిగినట్టు, హోదా అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై బీజేపీ నేతలు దీర్ఘాలోచనలో పడ్డట్టు సమాచారం.

First Published:  14 Nov 2020 11:36 PM GMT
Next Story