Telugu Global
Cinema & Entertainment

ప్లాన్ మార్చిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఆయన వకీల్ సాబ్ సినిమాను మళ్లీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ లోగా ఈ సినిమాను పూర్తిచేయాలని ముందుగా టార్గెట్ పెట్టుకున్నారాయన. అయితే ఇప్పుడు మళ్లీ ప్లాన్ మారింది. ఈ నెలాఖరులోగా వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తిచేయాల్సిందిగా యూనిట్ కు సమాచారం ఇచ్చాడు పవన్ కల్యాణ్. అవసరమైతే.. తను అదనంగా మరికొన్ని గంటలు పనిచేయడానికి సిద్ధమని, సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. […]

vakeel saab movie pawan-kalyan-plan-change
X

పవన్ కల్యాణ్ సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఆయన వకీల్ సాబ్ సినిమాను మళ్లీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ లోగా ఈ సినిమాను పూర్తిచేయాలని ముందుగా టార్గెట్ పెట్టుకున్నారాయన. అయితే ఇప్పుడు మళ్లీ ప్లాన్ మారింది.

ఈ నెలాఖరులోగా వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తిచేయాల్సిందిగా యూనిట్ కు సమాచారం ఇచ్చాడు పవన్ కల్యాణ్. అవసరమైతే.. తను అదనంగా మరికొన్ని గంటలు పనిచేయడానికి సిద్ధమని, సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి.

వచ్చే నెల నిహారిక పెళ్లి ఉంది. ఆ పెళ్లి కోసం పవన్ 3-4 రోజులు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో పాటు క్రిష్ సినిమాకు ఆయన 10 రోజులు కాల్షీట్లు ఇచ్చారు. అంటే దాదాపు 2 వారాల పాటు వకీల్ సాబ్ కాల్షీట్లకు కోత పడిందన్నమాట. అందుకే ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిందిగా ఆదేశించాడు పవన్.

First Published:  15 Nov 2020 9:29 AM GMT
Next Story