Telugu Global
Cinema & Entertainment

రీతూ వర్మకు వరుడు కావలెను

హీరోయిన్ రీతూవర్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతలోనే పెళ్లి ఏంటి.. వరుడు కావలెను అంటూ ప్రకటన ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది రియల్ లైఫ్ ప్రకటన కాదు. ఓ సినిమా టైటిల్. నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరుడు కావలెను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా చిన్నపాటి వీడియో […]

రీతూ వర్మకు వరుడు కావలెను
X

హీరోయిన్ రీతూవర్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతలోనే పెళ్లి ఏంటి.. వరుడు కావలెను అంటూ ప్రకటన ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది రియల్ లైఫ్ ప్రకటన కాదు. ఓ సినిమా టైటిల్.

నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరుడు కావలెను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా చిన్నపాటి వీడియో కూడా రిలీజ్ చేశారు. మూవీలో నాగశౌర్య, రీతూ లుక్స్ ఎలా ఉంటాయో ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూరోప్ వెళ్తారు.

First Published:  14 Nov 2020 8:30 PM GMT
Next Story