Telugu Global
National

చంద్రబాబుకి దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలి " సోము వీర్రాజు

పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరంపై ఏబీఎన్ రాధాకృష్ణకు అవగాహన లేదని, చంద్రబాబుకి అనుగుణంగా వార్తలు రాయాలనే తాపత్రయంతోనే ఇలా తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలవరంలో అవినీతి చేసిన వారిని కడిగిన ముత్యంలా చేసేందుకే వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి వార్తలు రాసే.. చంద్రబాబుకు 23 సీట్లు వచ్చేలా చేశారని, ఇంకా తగ్గించేందుకే తప్పుడు రాతలు కొనసాగిస్తున్నారని అన్నారు. దమ్ము, ధైర్యం […]

చంద్రబాబుకి దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలి  సోము వీర్రాజు
X

పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరంపై ఏబీఎన్ రాధాకృష్ణకు అవగాహన లేదని, చంద్రబాబుకి అనుగుణంగా వార్తలు రాయాలనే తాపత్రయంతోనే ఇలా తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలవరంలో అవినీతి చేసిన వారిని కడిగిన ముత్యంలా చేసేందుకే వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి వార్తలు రాసే.. చంద్రబాబుకు 23 సీట్లు వచ్చేలా చేశారని, ఇంకా తగ్గించేందుకే తప్పుడు రాతలు కొనసాగిస్తున్నారని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరంపై చర్చకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తే గతంలో తెలంగాణ నుంచి కలిపేసుకున్న మండలాలు జలాశయం పరిధిలోకి రావని, వాటిని తిరిగి కేసీఆర్ అడుగుతారంటూ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనిపై కూడా తీవ్రంగా స్పందించారు వీర్రాజు. భద్రాచలం సహా 10 మండలాలు తూర్పుగోదవరి జిల్లా పరిధిలోకి వస్తాయని, ముంపు మండలాల్ని మళ్లీ కేసీఆర్ అడుగుతారనే వాదన అర్థరహితం అన్నారు. ఇలాంటి పిచ్చిరాతలతో ఎవర్ని తప్పుదారి పట్టిస్తారంటూ ప్రశ్నించారు.

పోలవరం వైఎస్సార్ హయాంలో ప్రారంభమైందని, దాన్ని కేంద్రం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వీర్రాజు. వామపక్షాలు తెలుగుదేశానికి ఏజంట్లుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. చైనా వాళ్లు డబ్బులిస్తే వామపక్షాలు భారత్‌లో పనిచేస్తున్నాయని, చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని ఇక్కడ ఏపీలో వామపక్ష నాయకులు పనిచేస్తున్నారని, డబ్బులు తీసుకుని చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు వీర్రాజు.

First Published:  16 Nov 2020 4:43 AM GMT
Next Story