Telugu Global
National

బీహార్ లో ఉప ముఖ్యమంత్రి పదవే హాట్ టాపిక్...

బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకున్నా.. కూటమిలో జాతకాలు మాత్రం తిరగబడ్డాయి. అయితే మాట నిలబెట్టుకున్న బీజేపీ నేతలు.. తమకి అత్యథికంగా 74 సీట్లు వచ్చినా.. కేవలం 43 సీట్లు గెల్చుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశమిచ్చారు. నితీశ్ ముఖ్యమంత్రి అయినా.. ఈ దఫా అధికారం పూర్తిగా బీజేపీ నేతల గుప్పెట్లో ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ దశలో బీజేపీకి దక్కే ఉప ముఖ్యమంత్రి పదవి చుట్టూనే రాజకీయం […]

బీహార్ లో ఉప ముఖ్యమంత్రి పదవే హాట్ టాపిక్...
X

బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకున్నా.. కూటమిలో జాతకాలు మాత్రం తిరగబడ్డాయి. అయితే మాట నిలబెట్టుకున్న బీజేపీ నేతలు.. తమకి అత్యథికంగా 74 సీట్లు వచ్చినా.. కేవలం 43 సీట్లు గెల్చుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశమిచ్చారు.

నితీశ్ ముఖ్యమంత్రి అయినా.. ఈ దఫా అధికారం పూర్తిగా బీజేపీ నేతల గుప్పెట్లో ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ దశలో బీజేపీకి దక్కే ఉప ముఖ్యమంత్రి పదవి చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఇప్పటి వరకూ నితీశ్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ మోదీ ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

పోయిన దఫా… మహా గట్ బంధన్ నుంచి బంధ విముక్తుడై బైటకు వచ్చిన నితీశ్ కుమార్ తో బీజేపీ బేరసారాలకు దిగినమాట వాస్తవం. అదే సమయంలో సుశీల్ కుమార్ మోదీకి ముఖ్యమంత్రి పీఠం అడిగారు కూడా. అయితే నితీశ్ ససేమిరా అనడంతో.. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు, తిరిగి ఎన్నికల జోలికి వెళ్లలేక బీజేపీ కూడా నితీశ్ కే పగ్గాలు అప్పగించి సైలెంట్ గా ఉంది.

ఇక ఈ దఫా ఉప ముఖ్యమంత్రి రేస్ లో నుంచి సుశీల్ మోదీ తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీనియర్ నేత కిషోర్ ప్రసాద్ బీజేపీ లేజిస్లేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. దీంతో కిషోర్ ప్రసాద్ కే ఉప ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందనే వాదన వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా నితీశ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఉప ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇక పార్టీకి కష్ట సుఖాల్లో అండగా నిలబడి.. చివరకు అత్యథిక సీట్లు గెలిచిన సమయంలో కూడా పదవి త్యాగం చేసిన సుశీల్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన పదవిలో.. సుశీల్ ని తీసుకుంటారని బీజేపీ వర్గాల సమాచారం.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నేత కిషోర్ ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారు. కూటమిలో బలంలేని నితీశ్ మునుపటిలా దూకుడుగా ఉండే అవకాశాలు తక్కువ. ఆయన పరోక్షంలో కిషోర్ ప్రసాద్ బీహార్ లో మరో పవర్ సెంటర్ గా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  15 Nov 2020 8:39 PM GMT
Next Story