క్రేజీ మల్టీస్టారర్ కు లైన్ క్లియర్

వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ ఊపులో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ చేశారు. కానీ మధ్యలో లాక్ డౌన్ పడ్డంతో సినిమా సెట్స్ పైకి రావడం ఆలస్యమైంది. ఇప్పుడీ మూవీకి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల రెండో వారం ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

ఎఫ్3 కథను ఆల్రెడీ వెంకటేష్ కు వినిపించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. అటు వరుణ్ తేజ్ కూడా ఈ కథ విన్నాడు. ఇద్దరు హీరోలు ఓకే చెప్పేశారు. కాకపోతే వెంకీ చేతిలో నారప్ప సినిమా ఉంది. వరుణ్ తేజ్ కు తన చెల్లెలి పెళ్లి పనులతో పాటు చేతిలో సినిమా కూడా ఉంది.

సో.. డిసెంబర్ రెండో వారం నాటికి వీళ్లిద్దరూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సినిమా స్టార్ట్ చేసి, వీళ్లతో ఒక షెడ్యూల్ పూర్తిచేసి, తర్వాత చిన్న గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు.