Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడోసారి రిపీట్

ఒక హీరోతో సింక్ అయితే ఆ చిత్ర దర్శకుడు అతనితో రెండో సినిమా చేయడం సహజమే. కానీ వరుసగా అతనితో మూడు సినిమాలు చేస్తే మాత్రం డైరెక్టర్ కి హీరో ఫేవరేట్ అయిపోయాడని అర్థం. ఇది అలాంటి కాంబినేషనే. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబు మరోసారి కలిశారు. కొత్త సినిమా ప్రకటన ఇచ్చారు. సుదీర్ బాబు తో మొదటిసారి సమ్మోహనం సినిమా చేసిన ఇంద్రగంటి ఆ వెంటనే తను తీసిన థ్రిల్లర్ సినిమా Vలో […]

ముచ్చటగా మూడోసారి రిపీట్
X

ఒక హీరోతో సింక్ అయితే ఆ చిత్ర దర్శకుడు అతనితో రెండో సినిమా చేయడం సహజమే. కానీ వరుసగా అతనితో మూడు సినిమాలు చేస్తే మాత్రం డైరెక్టర్ కి హీరో ఫేవరేట్ అయిపోయాడని అర్థం. ఇది అలాంటి కాంబినేషనే. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబు మరోసారి కలిశారు. కొత్త సినిమా ప్రకటన ఇచ్చారు.

సుదీర్ బాబు తో మొదటిసారి సమ్మోహనం సినిమా చేసిన ఇంద్రగంటి ఆ వెంటనే తను తీసిన థ్రిల్లర్ సినిమా Vలో నానితో పాటు సుదీర్ కి కూడా చోటిచ్చాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సుధీర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

సుదీర్ బాబు తో మరో రొమాంటిక్ సినిమా ప్లాన్ చేశాడు మోహన కృష్ణ. ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్తుంది. సుధీర్ సరసన కృతిషెట్టి ని హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

First Published:  15 Nov 2020 8:30 PM GMT
Next Story