ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కదలిక

లాక్ డౌన్ పడకుండా ఉన్నట్టయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఈపాటికి ఓ కొలిక్కి వచ్చేది. కాబట్టి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కూడా సెట్స్ పై ఉండేది. కానీ అన్నీ తారుమారు అయిపోయాయి. ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. అలా 7 నెలలుగా స్తబ్దుగా మారిన ఈ ప్రాజెక్టుకు చలనం వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. షెడ్యూల్స్ లో ఓ క్లారిటీ వచ్చింది. మార్చి నాటికి ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాపై ఓ స్పష్టత వచ్చింది.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నారు. స్క్రీన్ ప్లేతో పాటు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ ను అధికారికంగా ప్రకటిస్తారు.