Telugu Global
National

శ్రేణులకు జనసేనాని దిశా నిర్దేశం... రేపటినుంచి క్రియాశీలక సమావేశాలు

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలు కాస్త తగ్గించారు. సినిమాలపై మళ్లీ పోకస్ పెంచారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఆ సినిమా 80% పూర్తయింది. […]

శ్రేణులకు జనసేనాని దిశా నిర్దేశం... రేపటినుంచి క్రియాశీలక సమావేశాలు
X

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలు కాస్త తగ్గించారు. సినిమాలపై మళ్లీ పోకస్ పెంచారు.

ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఆ సినిమా 80% పూర్తయింది. ఆ తర్వాత కరోనా మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసేందుకు కొద్ది రోజులుగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఈ సినిమా తర్వాత పవన్ మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించనున్నారు. దీనికి యువ దర్శకుడు సాగర్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ తో ఓ పాన్ ఇండియా మూవీ, హరీష్ శంకర్ తో ఓ సినిమా, అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారు. కాగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రేపటి నుంచి పార్టీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్ కార్యకలాపాలపై చర్చించనున్నారు.

అనంతపురం, నెల్లూరు రూరల్, ఇచ్చాపురం, రాజోలు మంగళగిరి నియోజకవర్గాల క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయిన నేపథ్యంలో మంగళవారం వారం ఉదయం 11 గంటలకు ఈ ఐదు నియోజకవర్గాలపై పవన్ సమీక్ష చేపట్టనున్నారు. అలాగే క్రియాశీలక సభ్యులకు పార్టీ తరఫున అందజేస్తున్న బీమా సౌకర్యానికి సంబంధించిన సర్టిఫికెట్లను పవన్ ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.

18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతి మహిళా రైతులతో పవన్ సమావేశం అవుతారు. రాజధాని కోసం వారు చేస్తున్న పోరాటంపై మాట్లాడతారు. అనంతరం ఉదయం 11 గంటలకు మరో 32 నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమై క్రియాశీలక సభ్యత్వం గురించి చర్చిస్తారు. సభ్యత్వ నమోదు కోసం జనసేన ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.

రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వరుసగా తాను నటించేందుకు ఒప్పుకున్న సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ వెళ్లిన పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టారు. వకీల్ సాబ్ నిర్మాణంలో ఉండగానే.. క్రిష్ సినిమా కు పది రోజుల పాటు పవన్ డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళ రీమేక్ సినిమా షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొననున్నారు.

First Published:  16 Nov 2020 4:04 AM GMT
Next Story