Telugu Global
NEWS

ఇళ్ళు కట్టించింది వైఎస్‌... కేటాయించింది చంద్రబాబు...

పోలవరం 70శాతం మేం పూర్తి చేశాం, వైసీపీ హయాంలో ఒక శాతం పనులు కూడా పూర్తి చేయలేదంటూ టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు కాసేపు పక్కనపెడితే.. అసలు పోలవరంపై గణాంకాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. టీడీపీ హయాంలో పోలవరం పనులు ఎంతమేర పూర్తయ్యాయి, వైసీపీ వచ్చాక ఏ స్థాయిలో జరుగుతున్నాయి..? లెక్కల్లోకి వెళ్తే… స్పిల్ వే పనులు.. అప్పుడు 22 మీటర్లు.. ఇప్పుడు 30 మీటర్లు.. 2014 జూన్ 8 నుంచి టీడీపీ […]

ఇళ్ళు కట్టించింది వైఎస్‌... కేటాయించింది చంద్రబాబు...
X

పోలవరం 70శాతం మేం పూర్తి చేశాం, వైసీపీ హయాంలో ఒక శాతం పనులు కూడా పూర్తి చేయలేదంటూ టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు కాసేపు పక్కనపెడితే.. అసలు పోలవరంపై గణాంకాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. టీడీపీ హయాంలో పోలవరం పనులు ఎంతమేర పూర్తయ్యాయి, వైసీపీ వచ్చాక ఏ స్థాయిలో జరుగుతున్నాయి..?

లెక్కల్లోకి వెళ్తే…

స్పిల్ వే పనులు.. అప్పుడు 22 మీటర్లు.. ఇప్పుడు 30 మీటర్లు.. 2014 జూన్ 8 నుంచి టీడీపీ హయాంలో పోలవరం పనులు మొదలయ్యాయి. 2019 మే 29 వరకు ఈ పనులు జరిగాయి. అంటే మొత్తం పదిరోజులు తక్కువ ఐదేళ్లు. ఈ ఐదేళ్ల కాలంలో స్పిల్ వే పనుల్లో సగటున 22 మీటర్ల మేర మాత్రమే పూర్తి చేసింది. స్పిల్ వేకు 25. 72 మీటర్ల స్థాయిలో గేట్లు బిగిస్తారు. అంటే గేట్లు బిగించే వరకు కూడా ఆ పనులు పూర్తి చేయలేని టీడీపీ.. ఏకంగా తాము 70శాతం పనుల్ని చేశామని చెప్పుకుంటోంది.

ఇదే స్పిల్ వే పనులు మెగా సంస్థ చేతిలోకి వచ్చాక జెడ్ స్పీడ్ లో జరిగాయి. వైసీపీ హయాంలో మెగా కన్స్ట్రక్షన్స్ ఈ పనుల్ని 30మీటర్ల మేర పూర్తి చేసింది. అది కూడా కేవలం ఏడాదిన్నర కాలంలోనే. ఇంకా చెప్పాలంటే గోదావరి వరదలు, కరోనా ఉధృతి లాంటివి ప్రతిబంధకాలుగా ఉన్నా.. 22 మీటర్ల మేర జరిగిన పనిని 52 మీటర్ల ఎత్తుకి పూర్తి చేసింది మెగా సంస్థ.

ఏడాదిన్నరలో 50 భారీ కాంక్రీట్ స్తంభాలను 30 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది మెగా సంస్థ. వరద ఉధృతిలోనూ ఈ పియర్స్ ‌పై స్పిల్‌ వే బ్రిడ్జి పనులు చేపట్టింది. ఇప్పుడా బ్రిడ్జి కూడా పూర్తయ్యే దశకు చేరుకుంది. నవంబర్ నెలాఖరు నుంచి 48 గేట్లను బిగించే పనులను చేపట్టి, వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో కాంట్రాక్ట్ సంస్థ ఉంది. ఈ క్రమంలోనే 24 గంటలు పోలవరం వద్ద పనులు జరుగుతున్నాయి.

పునరావాసంలోనూ వైసీపీదే పైచేయి..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉభయగోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపు బారిన పడతాయి. ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది జరిగినప్పుడే పోలవరం జలాశయంలో గరిష్ట స్థాయిలో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది.

ఈ పునరావాస పనులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయి. 2009 నాటికి పునరావాస కాలనీల్లో 3,110 ఇళ్లను నిర్మించారు. అప్పట్లోనే 2 వేల కుటుంబాలను ఆ కాలనీల్లోకి తరలించారు.

2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త ఇంటిని కూడా నిర్మించలేదంటే పునరావాసంపై టీడీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్ హయాంలో నిర్మించిన 1,110 ఇళ్లల్లోకి ముంపు ప్రాంత ప్రజలను తరలించింది టీడీపీ ప్రభుత్వం. ఈ తరలింపుతోనే 73 శాతం పనులు పూర్తయ్యాయంటూ తమ అనుకూల మీడియాతో ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు.

ఇక వైసీపీ హయాంలో ముంపు గ్రామాల్లోని మిగతా 1,02,491 కుటుంబాలకు రూ. 24,249.14 కోట్లతో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వాటిలో ఎక్కువశాతం ఇళ్లు కూడా పూర్తయ్యాయి. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. జూన్ నాటికి, గోదావరికి వరదలు ప్రారంభమయ్యేలోగా ఆయా కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులు వేగవంతం అవుతాయి. మిగిలిన 84,731 కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తమ్మీద చంద్రబాబు చెప్పుకుంటున్నట్టు టీడీపీ హయాంలో 70శాతం పనులు పూర్తి కాలేదని ఈ లెక్కలతో స్పష్టమవుతుంది. ఏడాదిన్నరలోనే వైసీపీ హయాంలో మెగా సంస్థ అంతకంటే ఎక్కువ శాతం పనులు పూర్తి చేసి.. 2022కల్లా పోలవరం పూర్తవుతుందన్న భరోసాని ఇచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022 ఖరీఫ్ సీజ్ నాటికి పోలవరం కాల్వల్లో గోదావరి గలగలలు వినిపిస్తాయనడం అతిశయోక్తి కాదు.

First Published:  15 Nov 2020 10:58 PM GMT
Next Story