Telugu Global
Cinema & Entertainment

సమంత యాంకరింగ్... రెమ్యూనరేషన్ ఎంతంటే...

రీసెంట్ గా యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎంటరైంది సమంత. ఆహా ఓటీటీకి శామ్-జామ్ పేరిట ఓ టాక్ షో చేస్తోంది. తొలి ఎపిసోడ్ లో భాగంగా విజయ్ దేవరకొండతో చిట్ చాట్ చేసింది. మరో 9 ఎపిసోడ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. ఈ కార్యక్రమం కోసం సమంత తీసుకుంటున్న మొత్తం ఎంతనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శామ్-జామ్ అనే టైటిల్ కింద, 10 ఎపిసోడ్స్ చేసేందుకు సమంత కోటిన్నర రెమ్యూనరేషన్ […]

సమంత యాంకరింగ్... రెమ్యూనరేషన్ ఎంతంటే...
X

రీసెంట్ గా యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎంటరైంది సమంత. ఆహా ఓటీటీకి శామ్-జామ్ పేరిట ఓ టాక్ షో చేస్తోంది. తొలి ఎపిసోడ్ లో భాగంగా విజయ్ దేవరకొండతో చిట్ చాట్ చేసింది. మరో 9 ఎపిసోడ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. ఈ కార్యక్రమం కోసం సమంత తీసుకుంటున్న మొత్తం ఎంతనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శామ్-జామ్ అనే టైటిల్ కింద, 10 ఎపిసోడ్స్ చేసేందుకు సమంత కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. నిజానికి ఇది చాలా తక్కువ మొత్తం. ఓ సినిమాకు సమంత తీసుకునే ఎమౌంట్ అక్షరాలా కోటి 75 లక్షలు. అలాంటిది 10 ఎపిసోడ్ల కార్యక్రమానికి ఆమె కోటిన్నర మాత్రమే తీసుకుంటోందంటే నమ్మశక్యంగా లేదు.

అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ లాబీయింగ్ బాగా పనిచేసి ఉండొచ్చని చాలామంది అనుమానిస్తున్నారు. అల్లు అరవింద్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అందులో భాగంగానే అతి తక్కువ పారితోషికానికి సమంత ఒప్పుకుందని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సమంత మాత్రం ఇలా టాక్ షోలు చేస్తూ తన క్రేజ్ ను తానే తగ్గించుకుంటోంది.

First Published:  15 Nov 2020 10:00 PM GMT
Next Story