సమర్పకుడిగా మారిన అనీల్ రావిపూడి

అనీల్ రావిపూడి హిట్ దర్శకుడు అని మనకు తెలుసు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడని కూడా తెలుసు. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రజెంటర్ గా మారాడు. ఎందుకంటే తన స్నేహితుడి కోసం.

వ‌రుసగా భ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో గాలి సంప‌త్ అనే సినిమా ప్రారంభ‌మైంది. ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్.క్రిష్ణ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

త‌న మిత్ర‌డు ఎస్‌. క్రిష్ణ కోసం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించడమే కాకుండా.. స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ సైడ్ ఈ చిత్రానికి అనిల్ రావిపూడి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నారు.

ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ గా లవ్ లీ సింగ్ ను ఎంపిక చేశారు. అనీష్ కృష్ణ ఈ మూవీకి దర్శకుడు. అయితే టైటిల్ లో చెప్పినట్టు గాలి సంపత్ మాత్రం శ్రీవిష్ణు కాదు, టైటిల్ పాత్రధారి రాజేంద్రప్రసాద్.