Telugu Global
National

ఫుల్ జోష్ లో బీజేపీ... దేశంలో నడ్డా వంద రోజుల యాత్ర

ఇటీవల జరిగిన బీహార్​ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ అదే ఊపును అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శించాలని చూస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల పై ఫోకస్ పెంచింది. అక్కడ బలోపేతం అయ్యేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా వందరోజుల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా అక్కడ బలహీనతలను తెలుసుకోవడంతో […]

ఫుల్ జోష్ లో బీజేపీ... దేశంలో నడ్డా వంద రోజుల యాత్ర
X

ఇటీవల జరిగిన బీహార్​ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ అదే ఊపును అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శించాలని చూస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల పై ఫోకస్ పెంచింది. అక్కడ బలోపేతం అయ్యేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా వందరోజుల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా అక్కడ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు… బలోపేతానికి చేయాల్సిన కృషి పై దృష్టి సాధించనున్నారు.

ఇప్పటికే బీజేపీ చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధానప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ‘రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్’ పేరుతో 100 రోజుల పాటు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన ప్రాంతాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయనున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగనుందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండటం.. అమిత్​షా లాంటి వ్యూహకర్తల సహకారంతో బీజేపీ దేశవ్యాప్తంగా దూసుకుపోతున్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారం చేజిక్కిచ్చుకుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. అయితే అక్కడ కూడా పాగా వేయాలని బీజేపీ యోచిస్తున్నది.

ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకోనున్నది. స్థానికంగా ఉన్న కీలకనేతలను తమపార్టీలోకి చేర్చుకోనున్నది. తద్వారా వైరి పక్షాన్ని బలహీన పరిస్తే తమ పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తున్నది. బీహార్​ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికి.. అక్కడ ఆర్​జేడీ కూడా గణనీయమైన స్థానాలు సాధించి సవాల్​ విసిరింది. ఈ నేపథ్యంలో పార్టీని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని అగ్రనాయకత్వం యోచిస్తున్నది. ఇందుకోసం వ్యూహాలను రచిస్తోంది.తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్​ పెట్టింది.

ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక రాజకీయ పరిస్థితులపై నడ్డా చర్చించనున్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి. ఎటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవాలి… తదితర అంశాలను చర్చించనున్నారు. ప్రతిరోజూ సమావేశాలు నిర్వహించనున్నారు. కోవిడ్​ నేపథ్యంలో ప్రతి సమావేశానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. 200 కు మించి పార్టీ శ్రేణులు హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బొకేలు, శాలువాలు, పూలదండలు తీసుకురావొద్దని ఇప్పటికే నాయకులకు సూచించారు.

First Published:  17 Nov 2020 2:27 AM GMT
Next Story