కోతికొమ్మచ్చిలో బిగ్ బాస్ బ్యూటీ

సింగిల్ షెడ్యూల్ లో తన సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇందులో భాగంగా అమలాపురంలో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు. దీపావళికి అక్కడ్నుంచే ప్రమోషన్ కూడా షురూ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.

అన్నీతానై సతీష్ వేగేశ్న తీస్తున్న ఆ కొత్త సినిమా పేరు కోతికొమ్మచ్చి. ఈ సినిమాతో సతీష్ వేగేశ్న తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. మరో హీరోగా శ్రీహరి తనయుడు మేఘామ్ష్ ను తీసుకున్నాడు. ఫస్ట్ టైమ్ తన ఇమేజ్ నుంచి బయటకొచ్చి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కాకుండా.. కాస్త రొమాన్స్-కామెడీ మిక్స్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ తీస్తున్నారు. బిగ్ బాస్ ఫేం, నటి నందినీరాయ్ ఈ ఐటెంసాంగ్ లో డాన్స్ చేస్తోంది. మరో నెల రోజుల్లో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది.