ఈ వీకెండ్… ఈ రెండు సినిమాలకు పోటీ

ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ప్రేక్షకులు రారనే అనుమానంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమా హాళ్లు మూసే ఉంచారు. దీంతో కొన్ని సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ మరో 2 సినిమాలు ఓటీటీలో పోటీపడుతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

ఈ వీకెండ్ ఓటీటీలో పోటీపడుతున్న సినిమాల్లో ఒకటి అనగనగా ఓ అతిథి. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ఇది. చైతన్య కృష్ణ హీరోగా నటించారు. ఓ పల్లెటూరిలో అర్థరాత్రి వేళ.. అనుకోకుండా ఓ ఇంటికి అతిథి వస్తే ఏం జరిగిందనే సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. పాయల్ ఇందులో పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. అంతేకాదు, ఈ పాత్ర కోసం ఆమె బరువు కూడా తగ్గింది. 20వ తేదీన ఆహాలో రిలీజ్ అవుతోంది ఈ సినిమా.

ఇక పాయల్ సినిమాకు పోటీగా వస్తున్న మరో మూవీ మిడిల్ క్లాస్ మెలొడీస్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వినోజ్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. వర్ష బొల్లమ్మ హీరోయిన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

సో.. ఈ వారాంతం రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.