ఆదిపురుష్ లో దేవరకొండ బ్యూటీ

ఆదిపురుష్ సినిమాపై రోజుకో అప్ డేట్ ఇచ్చారు ఆమధ్య. ఈ క్రమంలో దీపావళికి హీరోయిన్ ఎవరనే విషయాన్ని బయటపెడతారని అంతా అనుకున్నారు. కానీ ఆదిపురుష్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా దీనికి సంబంధించి అనన్య పాండే పేరు తెరపైకొచ్చింది.

ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర కోసం అనన్య పాండేను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం నడుస్తోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా పేర్లు తెరపైకొచ్చాయి. కానీ ఏదీ ఫిక్స్ అవ్వలేదు. అనన్య పాండే పేరైనా తొందరగా ప్రకటించాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ఈ సినిమానే సెట్స్ పైకి రాబోతున్న సంగతి తెలిసిందే.