Telugu Global
International

ఎట్టకేలకు జో బైడెన్​కు మోదీ ఫోన్... ఏం మాట్లాడుకున్నారంటే!

భారత ప్రధాని నరేంద్రమోదీ.. తొలిసారిగా అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయం సాధించిన జో బైడెన్​కు ఫోన్​ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బైడెన్​ అగ్రరాజ్యాధినేతగా గెలుపొందిన తర్వాత ప్రధాని మోదీ ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డోనాల్డ్ ట్రంప్ తరపున భారత ప్రధాని మోదీ ఆ దేశంలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన పదవీ కాలంలో ప్రధాని మోదీతో ఏంతో […]

ఎట్టకేలకు జో బైడెన్​కు మోదీ ఫోన్... ఏం మాట్లాడుకున్నారంటే!
X

భారత ప్రధాని నరేంద్రమోదీ.. తొలిసారిగా అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయం సాధించిన జో బైడెన్​కు ఫోన్​ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బైడెన్​ అగ్రరాజ్యాధినేతగా గెలుపొందిన తర్వాత ప్రధాని మోదీ ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డోనాల్డ్ ట్రంప్ తరపున భారత ప్రధాని మోదీ ఆ దేశంలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన పదవీ కాలంలో ప్రధాని మోదీతో ఏంతో సన్నిహితంగా మెలిగారు. ట్రంప్ కూడా ప్రధాని ఆహ్వానం మేరకు భారత్ లో పర్యటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించడంతో పలు దేశాల అధ్యక్షులు ఆయనకు ఫోన్ చేసి అభినందించినా మోదీ మాత్రం ఫోన్ చేయలేదు. ఎట్టకేలకు మోదీ మంగళవారం రాత్రి బైడెన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అగ్ర నేతల మధ్య ఇండో-ఆసియా పసిఫిక్, క్లైమెట్ ఛేంజ్ వంటి కీలకాంశాలపై సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగినట్టు సమాచారం. ప్రధాని మోదీ, జో బైడెన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం అధికారులు, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జింత్ సింగ్ సంధు వేర్వేరుగా వెల్లడించారు.

మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ కూడా వెల్లడించారు.

ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్​పై కూడా వీళ్లిద్దరూ సంభాషించుకున్నట్టు సమాచారం. భారత్‌-అమెరికా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా జో బైడెన్​ ‌కు హామీ ఇచ్చారని అమెరికాలోని భారత రాయభారి తరణ్‌జింత్ సింగ్ సంధు వెల్లడించారు.

2014లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో జో బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యక్షుడి హోదాలో జో బైడెన్ నరేంద్ర మోదీ గౌరవార్థం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారని చెప్పారు. బైడెన్​ నేతృత్వంలో భారత్​, అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని తరుణ్​జింత్​సింగ్​ చెప్పారు.

భారత సంతతికి చెందిన కమలాహ్యారిస్​ ఉపాధ్యక్షురాలిగా ఉండటం కూడా భారత్​కు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, రాజకీయాల పరంగా బంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.

First Published:  18 Nov 2020 1:51 AM GMT
Next Story