Telugu Global
Cinema & Entertainment

లాక్ డౌన్ తర్వాత ఇదే పెద్ద రిలీజ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఎంటర్‌టైనర్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఓపెన్ అయ్యే […]

లాక్ డౌన్ తర్వాత ఇదే పెద్ద రిలీజ్
X

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఎంటర్‌టైనర్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు.

లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.

సినిమాలో సాయితేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. సాయితేజ్‌, న‌భాన‌టేశ్ సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్స్ న‌టించిన ఈ ప‌వ‌ర్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతాన్ని అందించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌లు, థీమ్ వీడియోకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. వెంక‌ట్ సి.దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

First Published:  18 Nov 2020 10:57 AM GMT
Next Story