దేవరకొండ మరో నెల రోజులు ఖాళీ

లాక్ డౌన్ తో తనకు చాలా బోర్ కొట్టేస్తుందని ఇప్పటికే ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయబోతున్న ఫైటర్ సినిమా ఎంత త్వరగా సెట్స్ పైకి వస్తే, అంత తొందరగా సెట్స్ పైకి వాలిపోతానని ఓపెన్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చాడు. అయితే ఫైటర్ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల 20 నుంచి ఫైటర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడట పూరి జగన్నాధ్. ఇదే కనుక నిజమైతే.. విజయ్ దేవరకొండకు మరో నెల రోజుల పాటు వెయిటింగ్ తప్పదు.

లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ హీరో.. ఈమధ్యే యూరోప్ వెళ్లి వచ్చాడు. ఇక అంతా సెట్ అయిందనుకున్న టైమ్ కు మరో నెల రోజులు గ్యాప్ వచ్చింది. ఈసారి దేవరకొండ ఏ దేశం వెళ్తాడో చూడాలి.