Telugu Global
International

అవతార్ కొండ... అతి భారీ లిఫ్ట్... గుండె ఝల్లుమనే అనుభవం...

ఆ లిఫ్ట్ ఎక్కితే ఎవరికైనా గుండె ఝల్లుమనాల్సిందే. 1070 అడుగుల ఎత్తుని, కేవలం 88 సెకన్లలో చేరుకుంటుంది ఆ లిఫ్ట్. అంటే సెకనుకి 12 అడుగలకంటే ఎక్కువ వేగం. ఇలాంటి వేగవంతమైన లిఫ్ట్ లు జపాన్ లో ఉన్నా కూడా అవన్నీ అపార్ట్ మెంట్లు, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల్లో ఉంటాయి. అంటే కంప్లీట్ గా ఇండోర్ సెటప్ అనమాట. కానీ చైనాలో తొలిసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఔట్ డోర్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అవతార్ […]

అవతార్ కొండ... అతి భారీ లిఫ్ట్... గుండె ఝల్లుమనే అనుభవం...
X

ఆ లిఫ్ట్ ఎక్కితే ఎవరికైనా గుండె ఝల్లుమనాల్సిందే. 1070 అడుగుల ఎత్తుని, కేవలం 88 సెకన్లలో చేరుకుంటుంది ఆ లిఫ్ట్. అంటే సెకనుకి 12 అడుగలకంటే ఎక్కువ వేగం. ఇలాంటి వేగవంతమైన లిఫ్ట్ లు జపాన్ లో ఉన్నా కూడా అవన్నీ అపార్ట్ మెంట్లు, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల్లో ఉంటాయి. అంటే కంప్లీట్ గా ఇండోర్ సెటప్ అనమాట.

కానీ చైనాలో తొలిసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఔట్ డోర్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అవతార్ కొండగా పేిలుచుకునే కొండపైకి చేరడానికి ఈ లిఫ్ట్ ఉపయోగపడుతుంది. చైనాలోని జాంగ్జియాజి ఫారెస్ట్ పార్క్ లో ఈ కొండ ఉంది. అవతార్ సినిమాలో పండోరా గ్రహం మాదిరిగా దీన్ని రూపొందించారు. వాతావరణ పరిస్థితులన్నీ ఆ సినిమాలోలాగే ఉంటాయి.

అయితే ఈ అవతార్ కొండను ఎక్కాలంటే మాత్రం 3 గంటలసేపు కాళ్లకు పనిచెప్పాలి. లేదా.. ఒకే ఒక కేబుల్ కార్ సాయంతో కొండపైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కేబుల్ కార్ రోజుకి కనీసం పాతికమందిని కూడా తీసుకెళ్లలేదు. అందుకే చాలామందికి ఈ అవతార్ కొండను సందర్శించడం ఓ కలగానే మిగిలిపోయింది.

దీంతో ఇక్కడ కొండను తొలిచి ఓ భారీ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 1070 అడుగుల కొండ అంచుకి కేవలం ఒకటిన్నర నిముషంలోగా చేరుకునేలా లిఫ్ట్ ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత వేగవంతమైన ఔట్ డోర్ లిఫ్ట్ గా దీనికి ప్రత్యేకత వచ్చింది.

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా చైనాను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటీవలే పరిస్థితులు చక్కబడటంతో మెల్లిమెల్లిగా జాంగ్జియాజి ఫారెస్ట్ కి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. లిఫ్ట్ లో అవతార్ కొండను అధిరోహించే సాహసికులు ఎక్కువయ్యారు. రోజుకి 8వేలమంది టూరిస్ట్ లను కొండపైకి తీసుకెళ్లే సత్తా ఈ లిఫ్ట్ కి ఉంది.

భారత కరెన్సీలో ఒక్కొకరికి 1,411 రూపాయలు ఫీజు వసూలు చేస్తారట. పండోరో గ్రహాన్ని పోలిన సెటప్ ని చూడటం అద్భుతంగానే ఉంటుంది కానీ.. లిఫ్ట్ లో పైకి వెళ్లడం, అదే స్పీడ్ లో కిందకు దిగడం మాత్రం పెద్ద సాహసమేనని చెప్పాలి. గుండె ఝల్లుమనే అనుభవం ఉంటుందని తెలిసినా కూడా.. లాక్ డౌన్ తర్వాత పర్యాటకులు ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

First Published:  19 Nov 2020 8:28 AM GMT
Next Story