ఎట్టకేలకు పూర్తయింది

దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ఓ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తయింది. అదే లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించి సాంగ్ షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాయిపల్లవిపై ఆ సాంగ్ షూట్ చేశారు. అది  కంప్లీట్ అయింది. దీంతో టోటల్ మూవీ షూటింగ్ పూర్తయింది. అక్కడే గుమ్మడికాయ కొట్టారు.

ఈ సందర్భంగా కమ్ముల, సాయిపల్లవి, శేఖర్ మాస్టర్ కలిసి ఓ ఫొటో దిగి, షూటింగ్ పూర్తయిన విషయాన్ని బయటపెట్టారు. ఈ మూవీకి సంబంధించి నాగచైతన్య తన పోర్షన్ ను దాదాపు 3 వారాల కిందటే పూర్తిచేశాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను సరైన టైమ్ చూసి థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.