ఎట్టకేలకు సెట్స్ పైకి షారూక్

లాక్ డౌన్ తర్వాత హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. షారూక్ కూడా సెట్స్ పైకి వచ్చాడు. ఇందులో ఆశ్చర్యపోనడానికేముంది అనుకోవచ్చు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విశేషమే. ఎందుకంటే.. హీరోలంతా లాక్ డౌన్ తర్వాత సెట్స్ పైకి వస్తుంటే.. షారూక్ మాత్రం రెండేళ్ల తర్వాత మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టాడు.

అవును.. .2018 అక్టోబర్ లో తన సినిమా షూటింగ్ పూర్తిచేశాడు షారూక్. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ సెట్స్ పై అడుగుపెట్టలేదు. రెండేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఈరోజు షారూక్ తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ముంబయిలోని యష్ రాజ్ స్టుడియోస్ లో తన కొత్త సినిమా ‘పఠాన్’ ను స్టార్ట్ చేశాడు షారూక్.

2018లో రిలీజైన ”జీరో” అనే సినిమా తర్వాత మళ్లీ సెట్స్ పైకి రాలేదు షారూక్. అందుకే కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఈరోజు పండగ చేసుకుంటున్నారు. అన్నట్టు షారూక్ కొత్త సినిమా ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.