ఆమె ‘కమిట్ మెంట్’ రెడీ…

ఆమధ్య కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్, కాంప్రమైజ్ అంటూ చాలా హంగామా చేసింది నటి తేజశ్విని. అప్పట్లో ఆమె కామెంట్స్ వైరల్ అవ్వడంతో పాటు వివాదాస్పదమయ్యాయి కూడా. అలా వైరల్ అయిన రెండు రోజులకే ప్లేటు ఫిరాయించింది.

అదంతా ఉత్తిదేనని, తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ అనుభవాల్లేవని బుకాయించింది ఈ భామ. ”కమిట్ మెంట్” అనే సినిమా కోసమే అప్పట్లో తేజశ్విని ఈ హంగామా అంతా చేసిందనేది వాస్తవం. అలా తన సినిమాను వార్తల్లోకి తీసుకొచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడా మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది.

టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా మొత్తం ”కమిట్ మెంట్”ల గురించి ఉంటుంది. ”లైఫ్ ఏర్పడేదే సెక్స్ తో అయినపుడు ఒకరికి లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటి” అనే డైలాగ్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది తెలుస్తోంది.

లక్షీకాంత్ చెన్నా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో తేజశ్విని హీరోయిన్ అని అంతా అనుకున్నారు. కానీ నలుగురు హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఇంతోటి దానికి తేజశ్విని చేసిన హంగామా మాత్రం అంతా ఇంతా కాదు. సినిమా అంతా తనదే అన్నట్టుంది ఆమె యవ్వారం.