విఘ్నేష్ పై వెరైటీ ట్రోలింగ్

నయనతార-విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్నారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తన ఎఫైర్ ను సీక్రెట్ గా ఉంచాలని కూడా ఈ జంట ఎప్పుడూ అనుకోలేదు. విఘ్నేష్ ప్రతి బర్త్ డేకు నయనతార, అతడితో కలిసి విదేశాలకు వెళ్లింది. విఘ్నేష్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. చివరికి ఓ వైపు లాక్ డౌన్ ఉన్నప్పటికీ.. తాజాగా విఘ్నేష్ పుట్టినరోజుకు అతడ్ని గోవాకు తీసుకెళ్లింది.

నిన్న నయనతార పుట్టినరోజు. మరి నయన్ ను విఘ్నేష్ ఎక్కడికైనా తీసుకెళ్లాడా? సరిగ్గా ఇక్కడే కొంతమంది విఘ్నేష్ పై ట్రోలింగ్ షురూ చేశారు. “నీ బర్త్ డేకి నయనతార విదేశాలకు తీసుకెళ్తుంటే.. నువ్వు మాత్రం ఆమె బర్త్ డేకి ఎక్కడికీ తీసుకువెళ్లవా” అంటూ వెరైటీ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

నిజమే.. ఈ బర్త్ డేకి నయనతార-విఘ్నేష్ ఎక్కడికీ వెళ్లలేదు. ఇద్దరూ చెన్నైలోనే ఉన్నారు. దీనికి ఓ కారణం కూడా ఉంది. నయనతార కొత్త సినిమా ప్రమోషన్ నిన్నట్నుంచి మొదలుపెట్టారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి విఘ్నేష్ శివనే నిర్మాత. బహుశా.. ఈ పనుల వల్ల విఘ్నేష్-నయన్ ఎలాంటి టూర్లు పెట్టుకోలేదేమో.