Telugu Global
National

‘పరిహారం’ పై బీజేపీ, టీఆర్​ఎస్​ సవాళ్లు... మధ్యలో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి

హైదరాబాద్​ వరద బాధితుల పరిహారంపై బీజేపీ.. టీఆర్​ఎస్​ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. పేదలకు టీఆర్​ఎస్ ప్రభుత్వం రూ. 10 వేల పరిహారం ఇస్తుంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ ఎన్నికల కమిషన్​కు లేఖ రాసి పరిహారం నిలిచిపోయేలా చేశారని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. బండి సంజయ్​ రాసిన లేఖ ఇదేనంటూ టీఆర్​ఎస్​ ఓ లేఖను కూడా విడుదల చేసింది. అయితే ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రంగా స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని.. […]

‘పరిహారం’ పై బీజేపీ, టీఆర్​ఎస్​ సవాళ్లు... మధ్యలో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి
X

హైదరాబాద్​ వరద బాధితుల పరిహారంపై బీజేపీ.. టీఆర్​ఎస్​ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. పేదలకు టీఆర్​ఎస్ ప్రభుత్వం రూ. 10 వేల పరిహారం ఇస్తుంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ ఎన్నికల కమిషన్​కు లేఖ రాసి పరిహారం నిలిచిపోయేలా చేశారని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. బండి సంజయ్​ రాసిన లేఖ ఇదేనంటూ టీఆర్​ఎస్​ ఓ లేఖను కూడా విడుదల చేసింది. అయితే ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రంగా స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని.. తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. ఆ లేఖ తాను రాయలేదని ఛార్మినార్​ పక్కన ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని.. దమ్ముంటే కేసీఆర్​ భాగ్యలక్ష్మి టెంపుల్​కు రావాలంటూ సవాల్​ విసిరారు. ఈ సవాళ్లు.. ప్రతిసవాళ్లు ఇలా కొనసాగుతుండగానే మధ్యలోకి కాంగ్రెస్​ ఫైర్​ బ్రాండ్​ విజయశాంతి ఎంట్రీ ఇచ్చారు.

అసలు టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి పేదలకు పరిహారం ఇచ్చే ఉద్దేశ్యం లేదని.. కావాలనే ఎన్నికల ముందు పరిహారం అంటూ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఫేస్​బుక్​ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. ‘జీహెచ్​ఎంసీ ఓట్ల కోసమే సీఎం కేసీఆర్​ వరదసాయం విడుదల చేశారు. ముందు చేపట్టిన రూ. 10 వేల పంపిణీలో అవినీతి జరిగింది. ఆ సొమ్మును కార్యకర్తలు, టీఆర్​ఎస్​ చోటామోటా నాయకులు బొక్కేశారు. వరదసాయం అందలేదని ప్రజలు తిరగబడటంతో ఎలక్షన్​ నోటిఫికేషన్ వచ్చే ముందే వరదసాయం అంటూ డ్రామా ఆడారు. ఓ మహిళ సాయం డబ్బుల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయింది.

ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు’ అని విజయశాంతి ఆరోపణలు చేశారు.

First Published:  19 Nov 2020 6:29 AM GMT
Next Story