బిగ్ బాస్ హౌజ్ లోకి మళ్లీ ఎంట్రీ?

ప్రస్తుతం బిగ్ బాస్ పై నడుస్తున్నంత బజ్ మరే అంశంపై కనిపించడం లేదు. కంటెస్టెంట్లపై, ఎలిమినేషన్స్ పై, కంటెస్టెంట్ల ఎఫైర్లపై.. ఇలా ఒకటి కాదు, రోజుకో బజ్ పుట్టుకొస్తోంది. ఇందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయిని తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద హౌజ్ లో ప్రవేశపెట్టాలంటూ ఓ సెక్షన్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్స్ కు తగ్గట్టే.. కుమార్ సాయి మరోసారి హౌజ్ లో అడుగుపెట్టే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తనపై కొన్ని రోజులుగా నడుస్తున్న గాసిప్స్ పై కుమార్ సాయి కూడా రెస్పాండ్ అయ్యాడు. మరోసారి అవకాశం వస్తే.. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఏమాత్రం వెనకాడనని అంటున్నాడు.

ఇంకోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరయ్యే అవకాశం వస్తే మీ గేమ్ ప్లాన్ ఏంటనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇంతకుముందు కూడా తను ఎలాంటి గేమ్ ప్లాన్స్ అమలు చేయలేదని, ఈసారి కూడా ఎలాంటి ప్లాన్స్ ఉండబోవని అంటున్నాడు. తను బయట ఎలా ఉంటానో, హౌజ్ లో కూడా అలానే ఉంటానని చెబుతున్నాడు.

తనను మరోసారి హౌజ్ లోకి పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్న జనాలకు థ్యాంక్స్ చెప్పాడు కుమార్ సాయి. ప్రస్తుతం ఈ నటుడు కొన్ని స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడు. నాగార్జున ఇతడి కథ వింటానని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.