Telugu Global
Cinema & Entertainment

రైటర్స్ కు పూరి పాఠాలు

పూరి మ్యూజింగ్స్ పేరిట రోజుకో ప్రసంగం విడుదల చేస్తున్నాడు పూరి జగన్నాధ్. తాజాగా ఈ దర్శకడు.. ఔత్సాహిక రచయితలకు కొన్ని సలహాలు, సూచనలు అందించాడు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రచయితలు ఎలా ఉండాలి, ఏం చేయాలనే అంశాలపై గీతోపదేశం చేశాడు. లాక్ డౌన్ కు ముందు రాసుకున్న స్క్రిప్టులు ఏమైనా ఉంటే చించేయమంటున్నాడు పూరి జగన్నాధ్. లాక్ డౌన్ లో హీరోలు-నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా వరల్డ్ సినిమాకు అలవాటు పడ్డారని.. అలాంటి వాళ్లను మెప్పించాలంటే గ్లోబల్ […]

రైటర్స్ కు పూరి పాఠాలు
X

పూరి మ్యూజింగ్స్ పేరిట రోజుకో ప్రసంగం విడుదల చేస్తున్నాడు పూరి జగన్నాధ్. తాజాగా ఈ దర్శకడు.. ఔత్సాహిక రచయితలకు కొన్ని సలహాలు, సూచనలు అందించాడు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రచయితలు ఎలా ఉండాలి, ఏం చేయాలనే అంశాలపై గీతోపదేశం చేశాడు.

లాక్ డౌన్ కు ముందు రాసుకున్న స్క్రిప్టులు ఏమైనా ఉంటే చించేయమంటున్నాడు పూరి జగన్నాధ్. లాక్ డౌన్ లో హీరోలు-నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా వరల్డ్ సినిమాకు అలవాటు పడ్డారని.. అలాంటి వాళ్లను మెప్పించాలంటే గ్లోబల్ గా ఆలోచించాలని చెబుతున్నాడు.

కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదంటున్నాడు పూరి జగన్నాధ్. నార్కోస్, మనీ హెయిస్ట్ లాంటి వెబ్ సిరీస్ ల్ని సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశారని చెబుతున్నాడు. బి, సి సెంటర్ ఆడియన్స్ అయితే భాషతో సంబంధం లేకుండా చైనీస్, కొరియన్ మూవీస్ చూస్తున్నారని అన్నాడు పూరి.

ఇలాంటి టైమ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కంటెంట్ పక్కాగా ఉండాలంటున్న పూరి, దాని కోసం ఏడాది పాటు టైమ్ తీసుకోవద్దని కూడా చెబుతున్నాడు. ఫటాఫట్ స్క్రిప్టులు రాయాలని, చకచకా తీయాలని సూచిస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు పట్టుకొని ఓటీటీ జనాలు రెడీగా ఉన్నారని.. కంటెంట్ దొరక్క అల్లాడిపోతున్నాని అంటున్నాడు పూరి. సో.. కంటెంట్ ఉన్నోడిదే రాజ్యం అనేది పూరి మాట.

First Published:  20 Nov 2020 11:13 AM GMT
Next Story