Telugu Global
National

టీడీపీలో విషాదం... చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ (70) గురువారం రాత్రి కన్నుమూశారు. గత నెల 10న ఆమెకు కరోనా సోకడంతో అమె తన సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేరారు. అయితే ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఈ నెల 3వ తేదీన పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరకు గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. […]

టీడీపీలో విషాదం... చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
X

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ (70) గురువారం రాత్రి కన్నుమూశారు. గత నెల 10న ఆమెకు కరోనా సోకడంతో అమె తన సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేరారు.

అయితే ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఈ నెల 3వ తేదీన పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరకు గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబర్​ 21న జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆమె సత్యసాయిబాబా భక్తురాలు. బాబానే దగ్గరుండి ఆమెకు చిత్తూరుకు చెందిన పారిశ్రామికవేత్త ఆదికేశవులు నాయుడితో వివాహం జరిపించారు. ఆ తర్వాత ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్​లో కీలకనేతగా ఎదిగారు.

టీడీపీలో చేరి 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండు సార్లు టీటీడీ చైర్మన్​గా వ్యవహరించారు. 2009లో ఆయన చనిపోయారు. భర్త మరణాంతరం సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

2019లో టీడీపీ తరపున రాజంపేట ఎంపీగా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సత్యప్రభ తన హయాంలో చిత్తూరు నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. ఆమె మృతిపై టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

సత్యప్రభ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్​, టీడీపీ ఉపాధ్యక్షుడు అచ్చెనాయుడు సంతాపం తెలిపారు. సత్యప్రభ మరణం టీడీపీకి తీరని లోటని వారు పేర్కొన్నారు.

First Published:  19 Nov 2020 10:13 PM GMT
Next Story