హీరోయిన్లతో బాలయ్య హంగామా

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈసారి షెడ్యూల్ ప్రత్యేకత ఏంటంటే.. హీరోయిన్లు ఇద్దరూ ఒకేసారి సెట్స్ పైకి రావడం, ఈ సినిమాలో హీరోయిన్లుగా పూర్ణ, సాయేషాను తీసుకున్నారు. పూర్ణ సెలక్షన్ చాన్నాళ్ల కిందటే జరిగింది. సాయేషాను మాత్రం తాజాగా తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్న ప్రయాగ మార్టిన్ స్థానంలో సాయేషాను పెట్టారు. ఇప్పుడీ ఇద్దరు ముద్దుగుమ్మలతో బాలయ్య షూటింగ్ షురూ చేశాడు.

నిజానికి ఈనెల ప్రారంభంలోనే బాలయ్య సినిమా సెట్స్ పైకి వచ్చింది. 5 రోజులు షూట్ చేసి మళ్లీ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ షూట్ మొదలుపెట్టారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

లాక్ డౌన్ వల్ల మూవీ బిజినెస్ లో భారీ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. బాలయ్య-బోయపాటి సినిమాకు భారీగా బడ్జెట్ తగ్గించారు. అసలే బాలయ్యకు మార్కెట్ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ పెడితే, మొదటికే మోసం వస్తుంది. అందుకే బడ్జెట్ లో కోత బాగా పడింది.