Telugu Global
National

కొత్త సమస్యల వేటలో చంద్రబాబు...

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏ అంశాన్ని ఎత్తుకున్నా దానికి వెంటనే కాలం చెల్లిపోతోంది. దీంతో ఒకదాని వెంట ఒకటి తన వ్యూహాలు మార్చుకుంటూ బాబు ముందుకు పోతున్నారు, ఈ వ్యూహాల మార్పు పరోక్షంగా అధికార పార్టీకి మేలు చేయడంతో బాబు మరింత మండిపోతున్నారు. అమరావతి.. మూడు రాజధానుల అంశంతో.. అమరావతికి అన్యాయం జరిగిపోతోందంటూ ఏకంగా ఉద్యమమే మొదలు పెట్టారు చంద్రబాబు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతుల్ని రెచ్చగొట్టారు, కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. […]

కొత్త సమస్యల వేటలో చంద్రబాబు...
X

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏ అంశాన్ని ఎత్తుకున్నా దానికి వెంటనే కాలం చెల్లిపోతోంది. దీంతో ఒకదాని వెంట ఒకటి తన వ్యూహాలు మార్చుకుంటూ బాబు ముందుకు పోతున్నారు, ఈ వ్యూహాల మార్పు పరోక్షంగా అధికార పార్టీకి మేలు చేయడంతో బాబు మరింత మండిపోతున్నారు.

అమరావతి..

మూడు రాజధానుల అంశంతో.. అమరావతికి అన్యాయం జరిగిపోతోందంటూ ఏకంగా ఉద్యమమే మొదలు పెట్టారు చంద్రబాబు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతుల్ని రెచ్చగొట్టారు, కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. తీరా ఇతర ప్రాంతాలనుంచి వస్తున్న వ్యతిరేకతతో అమరావతి కాడె పడేశారు బాబు.

పోలవరం..

తమ హయాంలో పోలవరం 70శాతం పూర్తయిందని, వైసీపీ వచ్చాక కనీసం 2శాతం పనులు కూడా పూర్తి కాలేదనేది టీడీపీ ప్రధాన ఆరోపణ.

వాస్తవానికి రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని మార్చడమే టీడీపీకి కడుపుమంట. అయితే ప్రచార ఆర్భాటాలకి దూరంగా పోలవరంలో చకచకా పనుల్ని పూర్తి చేస్తోంది మెగా సంస్థ. డిసెంబర్ 2021నాటికి పోలవరం పూర్తి చేసి ఇస్తామని ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చింది.

దీంతో ప్రభుత్వ వర్గాలు పోలవరంపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. 2022 ఖరీఫ్ కి పోలవరం కాల్వల్లో గోదావరి గలగలలు వినిపిస్తాయని చెప్పేశారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు పోలవరాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న బాబు ఆశలు గల్లంతయ్యాయి.

టిడ్కో ఇళ్ల వ్యవహారం…

తమ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకుండా కక్షసాధిస్తోందంటూ ఇటీవల రోడ్డెక్కారు టీడీపీ నేతలు. వామపక్షాలను కూడా కలుపుకొని నానా యాగీ చేశారు. అయితే వాస్తవాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రజల కళ్లకు కట్టింది. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి, అరకొర నిర్మాణాలను పూర్తి చేసి, మౌలిక వసతులను పూర్తిగా మరచి.. అపార్ట్ మెంట్లకు రంగులేసి టీడీపీ నాటకం ఆడిందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు వైసీపీ నేతలు.

అంతేకాదు.. టీడీపీ తప్పులన్నీ తాము సరిదిద్ది అతి త్వరలో ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా అడుగులు వేశారు. దీంతో టిడ్కో ఉద్యమం కూడా అటకెక్కేసినట్టే. కోర్టుల్లో వివాదాలు ఉన్నవాటిని మినహాయించి.. మిగతా చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీకి కూడా ప్రభుత్వం డిసెంబర్ 25న మహూర్తం నిర్ణయించడంతో టీడీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదు.

నవరత్నాల పథకాల్లో ఏ ఒక్కదానికీ వంక పెట్టడం కుదరకపోవడంతో.. కొత్త సమస్యకోసం ఆరా తీస్తున్నారట చంద్రబాబు. స్థానిక ఎన్నికలు, నిమ్మగడ్డ వ్యవహారం, సుప్రీం చీఫ్ జస్టిస్ కి జగన్ రాసిన లేఖ.. ఇలాంటివన్నీ టీడీపీకి పెద్దగా ఉపయోపడేవి కావు.

మొత్తమ్మీద ఐదేళ్లపాటు ఏదో ఒక సమస్యతో కాలం గడపాలనుకుంటున్న చంద్రబాబుకి ఇప్పుడు అర్జంట్ గా ఓ సమస్య కావాలి, దాని పరిష్కారం తానేనంటూ ఉద్యమం మొదలు పెట్టాలి.

First Published:  20 Nov 2020 9:50 PM GMT
Next Story