ఇలియానా న్యూ ఇయర్ ప్లాన్స్

హీరోయిన్లంతా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. కొందరు సినిమాలు స్టార్ట్ చేసి రిలాక్స్ అవుతుంటే, మరికొందరు రిలాక్స్ అయి మూవీస్ సెట్స్ పైకి వస్తున్నారు. అయితే ఇలియానా ప్లాన్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆమె ఇప్పట్నుంచే న్యూ ఇయర్ ప్లాన్స్ లో ఉంది.

అవును.. ఈ ఏడాది క్రిస్మస్ కు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంది ఇలియానా. ఈ బ్యూటీ తల్లి అమెరికాలోనే ఉంటోంది. ఆమెను చూసినట్టు అవుతుంది, పైగా క్రిస్మస్ తర్వాతొచ్చే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఇలియానా ఇలా ఫిక్స్ అయింది.

అంతా బాగానే ఉంది కానీ కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. అమెరికాలో సంబరాలు, పార్టీలు అన్నీ బంద్ అయ్యాయి. ఈసారి న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉండవు. ఇలాంటి టైమ్ లో ఇలియానా అమెరికా వెళ్లి ఏం చేస్తుందో చూడాలి.