మొదలైన లీకుల గోల

ఓ పెద్ద సినిమా ఇలా మొదలవ్వడం ఆలస్యం అలా లీకులు ప్రారంభమైపోతాయి. పుష్ప సినిమాకు కూడా ఈ బెడద తప్పలేదు. ఈ సినిమా కోసం బన్నీ కొత్తగా తయారయ్యాడు. ఫుల్లుగా గడ్డం, మీసాలు పెంచాడు. ఇంతవరకు ఓకే, అతడి డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉంటుందనేది మాత్రం చిన్న సస్పెన్స్ ఉంది.

ఇప్పుడా సస్పెన్స్ కు తెరపడింది. పుష్ప సెట్స్ నుంచి బన్నీ లుక్ లీక్ అయింది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ లుంగీ కట్టుకొని కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఓ పాత కాలం నాటి జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. దానిపై ఓ మాసిన చొక్కా వేసుకున్నాడు. అంతేకాదు, దాన్ని ఇన్-షర్ట్ కూడా చేశాడు.

ఊహించని విధంగా బన్నీ లుక్ బయటకు రావడంతో యూనిట్ ఇప్పుడు మరింత జాగ్రత్తలో పడింది. ఇకపై యూనిట్ సభ్యులెవ్వరూ సెల్ ఫోన్స్ తీసుకురావొద్దని ఆర్డర్స్ వేసింది. అంతా తమ కాటేజీల్లో మొబైల్ ఫోన్లు పెట్టేసి రావాలని సూచించిన యూనిట్.. రోజూ ప్రతి ఒక్కర్ని చెక్ చేసిన తర్వాతే సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించుకుంది.