ఈసారి తమిళ రాజకీయాలపై పడ్డాడు

ఎక్కడ వివాదం ఉంటే అక్కడ వర్మ ఉంటాడు. దానిపై చకచకా ఓ సినిమా తీసేస్తాడు. విషయం వేడిగా ఉన్న టైమ్ లోనే రిలీజ్ చేస్తాడు. తద్వారా తన సినిమాకు కావాల్సినంత ప్రచారం పొందుతుంటాడు. ఇప్పుడీ దర్శకుడు మరో వివాదంపై పడ్డాడు. ఈసారి ఏకంగా తమిళ రాజకీయాల్ని టచ్ చేస్తున్నాడు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళపై సినిమా ప్రకటించాడు ఆర్జీవీ. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ కూడా నడుస్తుందని తెలిపాడు. ఈ సినిమాకు శశికళ అనే పేరు పెట్టిన వర్మ.. తమిళనాడు ఎన్నికల కంటే ముందే తన సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టంచేశాడు.

“ఏ వ్యక్తికైతే నువ్వు చాలా క్లోజ్ గా ఉంటావో, ఆ వ్యక్తిని చంపడం చాలా ఈజీ” అనే క్యాప్షన్ తగిలించాడు వర్మ. ఇది తమిళ్ లో మంచి సామెత అంటూ చెప్పుకొచ్చిన వర్మ.. ఈ స్టేట్ మెంట్ తో తను సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పకనే చెప్పాడు.