మహేష్ మూవీ లాంఛ్ అయింది

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కనుంది.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొన్ని నెలల కిందట ప్రకటించిన ఈ సినిమాను, ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.

ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్ ని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో తీశారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. నటీనటుల వీసా ప్రాసెసింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఫ్లయిట్ ఎక్కి అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యం.