Telugu Global
National

గ్రేటర్​ ఫైట్​... టీఆర్​ఎస్​ దూకుడు!

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై టీఆర్​ఎస్​ దూకుడు పెంచింది. దుబ్బాక ఓటమిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి పక్కాగా స్కెచ్​ వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి ఇలా ప్రతి విషయంపై టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 100కు పైగా స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మంత్రులు, ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దుబ్బాకలో గెలుపుతో బీజేపీ కూడా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నది. నగర ఓటర్లు తమకే అనుకూలంగా ఉంటారని బీజేపీ నాయకత్వం ఆశగా ఉన్నది. మరోవైపు ఇటీవల […]

గ్రేటర్​ ఫైట్​... టీఆర్​ఎస్​ దూకుడు!
X

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై టీఆర్​ఎస్​ దూకుడు పెంచింది. దుబ్బాక ఓటమిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి పక్కాగా స్కెచ్​ వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి ఇలా ప్రతి విషయంపై టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 100కు పైగా స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మంత్రులు, ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

దుబ్బాకలో గెలుపుతో బీజేపీ కూడా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నది. నగర ఓటర్లు తమకే అనుకూలంగా ఉంటారని బీజేపీ నాయకత్వం ఆశగా ఉన్నది. మరోవైపు ఇటీవల వరదలు రావడం.. పరిహారం సరిగ్గా అందకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. అయితే కాంగ్రెస్​ పార్టీ కూడా ఎలాగైనా జీహెచ్​ఎంసీలో పట్టు నిలుపుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ ముఖ్య నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు.

పోలింగ్​ తేదీకి తక్కువ సమయం ఉండటంతో పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. ఇప్పటికే వివిధ డివిజన్లలో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దుబ్బాక ఫలితం ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్​ కావొద్దని సీఎం కేసీఆర్​… పార్టీ ముఖ్యనాయకులకు గట్టిగా సూచించారు. ఈ సారి హైదరాబాద్​లో 100 సీట్లకు పైనే గెలుచుకోవాలని మంత్రి కేటీఆర్​ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల టీఆర్​ఎస్​ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. మంత్రులకు, ముఖ్య నాయకులకు సీఎం కేసీఆర్​ కొన్ని ప్రాంతాలను అప్పజెప్పారు. వారు ఎప్పటికప్పుడు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా టీఆర్​ఎస్​ పార్టీ స్టార్​ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందిని ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే ఈ జాబితాను ఎన్నికల సంఘానికి పంపించారు. ఇందులో ఇద్దరు మహిళా మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించారు.

టీఆర్​ఎస్​ స్టార్ క్యాంపెయినర్లు.. కేసీఆర్ (ముఖ్యమంత్రి), కేటీఆర్ (టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్), హరీశ్​రావు (మినిస్టర్), మహమూద్ అలీ (మినిస్టర్), ఈటల రాజేందర్ (మినిస్టర్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (మినిస్టర్), కొప్పుల ఈశ్వర్ (మినిస్టర్), సబితా ఇంద్రారెడ్డి (మినిస్టర్), పువ్వాడ అజయ్ (మినిస్టర్), సత్యవతి రాథోడ్ (మినిస్టర్). టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు 150 డివిజన్లలో నామినేషన్లు వేసి.. బల్దియా బరిలో మిగతా పార్టీల కంటే ముందు నిలిచారు.

First Published:  21 Nov 2020 4:14 AM GMT
Next Story