Telugu Global
National

కాలుష్యాన్ని తగ్గించడానికి... 70లక్షల లీటర్ల నీళ్లు !

మన రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఒక ఎడతెగని సమస్యగా మారిపోయింది. దానిని నియంత్రణలో ఉంచేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నా కాలుష్య భూతం మాత్రం పట్టి పీడిస్తునే ఉంది. గాలిలోని దుమ్ముని తగ్గించేందుకు గత 36 రోజులుగా అక్కడ నీళ్లను విపరీతంగా చిమ్ముతున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్… కాలుష్యం మరీ ఎక్కువగా ఉన్న 13 ప్రాంతాల్లో 70 లక్షల లీటర్లకు పైగా నీటిని ఇలా చిమ్మినట్టు తెలుస్తోంది. ఇందుకోసం 15 ఫైర్ ట్రక్కులను వినియోగించారు. 45 మంది అగ్నిమాపక […]

కాలుష్యాన్ని తగ్గించడానికి... 70లక్షల లీటర్ల నీళ్లు !
X

మన రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఒక ఎడతెగని సమస్యగా మారిపోయింది. దానిని నియంత్రణలో ఉంచేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నా కాలుష్య భూతం మాత్రం పట్టి పీడిస్తునే ఉంది. గాలిలోని దుమ్ముని తగ్గించేందుకు గత 36 రోజులుగా అక్కడ నీళ్లను విపరీతంగా చిమ్ముతున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్… కాలుష్యం మరీ ఎక్కువగా ఉన్న 13 ప్రాంతాల్లో 70 లక్షల లీటర్లకు పైగా నీటిని ఇలా చిమ్మినట్టు తెలుస్తోంది. ఇందుకోసం 15 ఫైర్ ట్రక్కులను వినియోగించారు. 45 మంది అగ్నిమాపక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినప్పటినుండి రోజుకి సగటున రెండు లక్షల లీటర్ల చొప్పున నీటిని చల్లుతున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. రోజూ ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఈ పనిచేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో పొగమంచు, చలిగాలులు విపరీతంగా పెరగటంతో కాలుష్యం కూడా మరింతగా పెరుగుతోంది. దీపావళిరోజు, ఆ తరువాత రోజు ఉన్న కాలుష్య స్థాయి గత నాలుగేళ్ల కాలుష్యంతో పోలిస్తే గరిష్టంగా ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్… ఈ నెల తొమ్మిదవ తేదీ అర్థరాత్రి నుండి 30వ తేదీ అర్థరాత్రి వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగాలపై నిషేధం విధించింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది… కాలుష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. సిటీలో ప్రస్తుత చలికాలంలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఢిల్లీ సెక్రటేరియట్ లో గ్రీన్ వార్ రూమ్ ని ఏర్పాటు చేశారు.

First Published:  22 Nov 2020 7:04 AM GMT
Next Story