Telugu Global
National

ఎన్నికల రోజు... 4 జిల్లాల్లో సెలవు

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్‌లో అందరూ పాల్గొనడానికి వీలుగా 4 జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ 4 జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలకు కూడా […]

ఎన్నికల రోజు... 4 జిల్లాల్లో సెలవు
X

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్‌లో అందరూ పాల్గొనడానికి వీలుగా 4 జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ 4 జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఈ నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30 సాయంత్రం నుంచి డిసెంబర్ 2 ఉదయం వరకు, డిసెంబర్ 3 సాయంత్రం నుంచి డిసెంబర్ 5 ఉదయం వరకు బార్లు, వైన్స్ బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

First Published:  21 Nov 2020 10:22 PM GMT
Next Story