Telugu Global
National

స్వామిగౌడ్ చూపు... బీజేపీ వైపు

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపి ఇప్పటికే వ్యూహాలు రచించింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల్లోని నాయకులను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా మరింత బలం పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న స్వామిగౌడ్‌ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా లబ్ది పొందాలను చూస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన స్వామిగౌడ్‌కు ఉద్యోగుల్లో మంచి […]

స్వామిగౌడ్ చూపు... బీజేపీ వైపు
X

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపి ఇప్పటికే వ్యూహాలు రచించింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల్లోని నాయకులను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా మరింత బలం పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న స్వామిగౌడ్‌ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా లబ్ది పొందాలను చూస్తున్నది.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన స్వామిగౌడ్‌కు ఉద్యోగుల్లో మంచి పేరు ఉన్నది. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయన అందరికీ దగ్గరివాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. అంతే కాకుండా అతని సామాజిక వర్గం గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్నది. కాబట్టి ఆయన రాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు.

మరోవైపు స్వామిగౌడ్ చేరితే వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ లేదా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఆయన ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారని.. రెండు మూడు రోజుల్లో చెబుతానని చెప్పినట్లు సమాచారం.

కాగా, స్వామిగౌడ్ చేరిక ఖాయమేనని బీజేపీ సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని.. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని ఆయన అన్నారు.

First Published:  21 Nov 2020 11:52 PM GMT
Next Story