వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ

అన్నీ అనుకున్నట్టు జరిగితే దర్శకుడు వీవీ వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను తెలుగులో హీరోగా పరిచయంచేశాడు వీవీ వినాయక్. ఇప్పుడు అదే హీరోను, ఛత్రపతి రీమేక్ తో హిందీకి కూడా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడట ఈ దర్శకుడు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది.

నిజానికి ఛత్రపతి రీమేక్ ను సుజీత్ హ్యాండిల్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఈ మేరకు కథనాలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు సుజీత్ స్థానంలో వినాయక్ వచ్చి చేరాడు. సెంటిమెంట్ కొద్దీ వినాయక్ కే ఈ సినిమా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.