Telugu Global
National

అమరావతిని గ్రాఫిక్స్ తో నిర్మించారు... పోలవరాన్ని మీడియాతో పడగొడుతున్నారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే దాదాపు 55 మీటర్ల ఎత్తువరకు జరిగింది. ఆ విషయం అక్కడ కనిపిస్తూ ఉంది. అయినా పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు తగ్గించేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ, దాని తోక పార్టీ సీపీఐ, ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 55 మీటర్ల ఎత్తు వరకు జరిగిన నిర్మాణాన్ని 41 మీటర్లకు ఎలా తగ్గించగలరు? ఇప్పటికే కట్టిన కట్టడాలను కూల్చివేస్తారా? ఇంత అడ్డమైన రాతలు రాయడానికి తెలుగుమీడియాకే చెల్లింది, సీపీఐ […]

అమరావతిని గ్రాఫిక్స్ తో నిర్మించారు... పోలవరాన్ని మీడియాతో పడగొడుతున్నారు
X

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే దాదాపు 55 మీటర్ల ఎత్తువరకు జరిగింది. ఆ విషయం అక్కడ కనిపిస్తూ ఉంది. అయినా పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు తగ్గించేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ, దాని తోక పార్టీ సీపీఐ, ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి.

ఇప్పటికే దాదాపు 55 మీటర్ల ఎత్తు వరకు జరిగిన నిర్మాణాన్ని 41 మీటర్లకు ఎలా తగ్గించగలరు? ఇప్పటికే కట్టిన కట్టడాలను కూల్చివేస్తారా? ఇంత అడ్డమైన రాతలు రాయడానికి తెలుగుమీడియాకే చెల్లింది, సీపీఐ లాంటి కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమయ్యింది.

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును 41 మీటర్లకు తగ్గించేస్తున్నారంటూ వివాదం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ రాజకీయ సంఘాలతో పాటు ఆ పార్టీకి కొమ్ముకాసే పచ్చమీడియా గత కొద్దిరోజులుగా ఓ వైపున ప్రాజెక్ట్‌ నిర్మాణం నిలిచిపోయిందంటూ మరో వైపు ఎత్తు తగ్గించేస్తున్నారంటూ నానా యాగీ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పనులు ముమ్మరంగా జరుగుతూ, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతున్నా… ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రాజెక్టు ఎత్తు అంశం తెరమీదకు తెచ్చారు.

వాస్తవానికి ఎత్తు తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడూ ఆదేశించలేదు. అసలు ఇప్పటికే పోలవరం స్పిల్‌ వే నిర్మాణం 52 మీటర్లు దాటిపోయి బ్రిడ్జి తదితర పనులు పూర్తి చేయడం ద్వారా మొత్తం ఎత్తు 55 మీటర్లకు పూర్తిచేసేందుకు పనులు జరుగుతున్నాయి. ఈ దశలో 41 మీటర్లకు ఎత్తును తగ్గించడం ఇక సాధ్యం కాదు. అటువంటప్పుడు 41 మీటర్లకే పోలవరం నిర్మాణం పరిమితం చేస్తున్నారనే వాదన వితండవాదం కాకపోతే మరేమిటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే పోలవరం 41 మీటర్లకు తగ్గించాలంటే నిర్మించిన ప్రాజెక్ట్ ను తిరిగి పగలగొట్టాల్సిందే. అదేలా సాధ్యమవుతుంది? 55 మీటర్లకు పూర్తి స్థాయిలో నిర్మాణమవుతున్న పోలవరానికి సంబంధించిన నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిద్దాం.. వాస్తవాలు మనకే అర్థమవుతాయి.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా పక్కా ప్రణాళికలతో స్పిల్ వే పనులు చకాచకా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హాయంలో పిల్లర్లు 28 మీటర్ల ఎత్తు ఉంటే ఇప్పుడు 52 మీటర్ల ఎత్తుకు నిర్మించినా స్పిల్ వే కంటికి కనబడుతుండగా.. ప్రతిపక్షాలు స్పిల్ వే ఎత్తు తగ్గింపు పై గోల చేయడం వెనక మతలబు ఏమిటి..? కట్టిన స్పిల్ వే ని కూలగొట్టమనా లేదా చంద్రబాబు నిర్దేశించిన 47.5 మీటర్ల ఎత్తు వరకు ఉండేలా జేసీబీలతో కూల్చేయాలనా? ఈ ప్రాజెక్టును మేఘా చేపట్టిన తరువాత నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ… ఒక ఏడాదిలోనే స్పిల్ వే మరియు స్పిల్ ఛానల్ లో 3.25 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేసింది.

ఇందులో స్పిల్ వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన స్పిల్ ఛానల్ లో ఉన్న వరద నీటిని తోడే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ వరద నీటిని తోడి ఈ సీజన్ లోనే మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడాచురుకుగా సాగుతున్నాయి.

అతి తక్కువ కాలంలోనే స్పిల్ వే పై 192 గడ్డర్ల నిర్మాణం చేపట్టి వాటిపై పిల్లర్లు అమర్చి, దాదాపు 300 మీటర్ల బ్రిడ్జ్ స్లాబ్ ని మేఘా ఇంజినీరింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించింది. మిగతా గడ్డర్లు, షట్టరింగ్, స్టీల్ పనులు, కాంక్రీట్ పనులు రాత్రింపగళ్లు కొనసాగిస్తూ పోలవరం ప్రాజెక్ట్ ను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని మేఘా సంస్థ పట్టుదలతో ఉంది.

పోలవరంకు సంబంధించిన ఒక్కో గేట్ 300 టన్నుల బరువు కలిగి, 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉండే అతి భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఇందుకు గాను కీలకమైన 25 ట్రునీయన్ భీమ్ లను నిర్మించింది. గేట్ల ఏర్పాటుకు కావాల్సిన 98 సిలిండర్లలో 46 సిలిండర్ లు జర్మనీ నుండి ఇప్పటికే పోలవరం చేరుకున్నాయి. మిగతా సిలిండర్ లు త్వరలోనే చేరుకోనున్నాయి. దీనికి తోడు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం చాలా వరకు 55 మీటర్లు పూర్తవడంతో గేట్ల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేస్తోంది.

అవరోధాలు ఎన్ని ఎదురైనా అతి తక్కువ కాలంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ 52 మీటర్ల వరకు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం కావచ్చు, పెద్ద ఎత్తున గడ్డర్లు నిర్మించి బ్రిడ్జ్ స్లాబ్ వేయడం, అతి భారీ గేట్లను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండి పోలవరం రూపురేఖలను మార్చిన మేఘా ఇంజినీరింగ్ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది అనడంలో అతిశయోక్తి లేదు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎత్తు గురించి వాస్తవాలు చెప్పకుండా వక్రీకరణలు చేస్తూ పెద్ద ఎత్తున అబద్ధాలతో ప్రతిపక్షాలు మరియు పచ్చ మీడియా విష ప్రచారం చేయడం రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేయడమే.

First Published:  23 Nov 2020 3:06 AM GMT
Next Story