Telugu Global
Cinema & Entertainment

హీరో-దర్శకుడికి 30 కోట్లు...!

త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్నా పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అక్కడితో ఆగడం లేదు, ఈ ఎమౌంట్ కు తోడు.. దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఓ ఫారిన్ కారును కూడా […]

హీరో-దర్శకుడికి 30 కోట్లు...!
X

త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్నా పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అక్కడితో ఆగడం లేదు, ఈ ఎమౌంట్ కు తోడు.. దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఓ ఫారిన్ కారును కూడా అందుకోబోతున్నాడు. ఇదంతా ప్యాకేజీలో భాగమే.

ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు ఈ దర్శకుడు. దేవరకొండతో చేయబోయే సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అంటే ప్రాజెక్టు బడ్జెట్ లో 30 కోట్లు వీళ్లిద్దరి పారితోషికాలకే సరిపోయింది. ఇక సినిమా మేకింగ్ కు ఇంకెంత ఖర్చవుతుందో! చూస్తుంటే, విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమాలా ఉంది.

First Published:  22 Nov 2020 8:30 PM GMT
Next Story