Telugu Global
International

బైడెన్​ గెలుపును గుర్తించం... రష్యా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. జో బైడెన్​ గెలుపొందారు. అధికారమార్పిడి కూడా జరుగుతున్నది. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్​ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. బైడెన్​ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. రిగ్గింగ్​ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్​ కూడా ట్రంప్​కు వంతపాడుతున్నాడు. జో బైడెన్​ గెలుపును తాను గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ఏ దేశంలో అయినా ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రతిపక్ష పార్టీ కూడా ఓటమిని అంగీకరించాలి. అప్పుడే ఎన్నికలు […]

బైడెన్​ గెలుపును గుర్తించం... రష్యా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. జో బైడెన్​ గెలుపొందారు. అధికారమార్పిడి కూడా జరుగుతున్నది. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్​ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. బైడెన్​ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. రిగ్గింగ్​ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్​ కూడా ట్రంప్​కు వంతపాడుతున్నాడు. జో బైడెన్​ గెలుపును తాను గుర్తించడం లేదని స్పష్టం చేశారు.

ఏ దేశంలో అయినా ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రతిపక్ష పార్టీ కూడా ఓటమిని అంగీకరించాలి. అప్పుడే ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు లెక్క. అంతేకాని ప్రతిపక్షం ఒప్పుకోకపోతే ఏదో తేడా ఉందని గమనించాలి. అమెరికా అధ్యక్షుడిగా ఏ పార్టీ వాళ్లు ఎన్నికైనా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బైడెన్​ను అధ్యక్షుడిగా తాను గుర్తించలేనని స్పష్టం చేశారు. కొత్తగా చెడిపోయేదేముంది అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

చైనా కూడా గతంలో జోబైడెన్​ను అధ్యక్షుడిగా ఒప్పుకోలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. చాలా రోజుల తర్వాత చెప్పింది. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

‘అమెరికాతో మాకు ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా మాకు వచ్చే నష్టమూ… లేదు లాభము లేదు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఓడి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు చెప్పిందంటే ఆ విషయం గురించి మనం ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఓటమిని అంగీకరించినప్పుడే ఆ ఎన్నిక సంపూర్ణమవుతుంది. కానీ అమెరికాలో ఆ పరిస్థితి లేదు.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లలో తప్పిదాలు జరిగాయని సాక్షాత్తూ మరో పార్టీ అభ్యర్థి ప్రకటిస్తున్నాడు. కాబట్టి మేము జో బైడెన్​ను ఇప్పటికైతే అధ్యక్షుడిగా గుర్తించలేకపోతున్నాం’ అని పుతిన్​ పేర్కొన్నాడు.

First Published:  23 Nov 2020 2:58 AM GMT
Next Story