Telugu Global
National

దూసుకొస్తున్న నివర్ తుఫాను... ఏపీలో హై అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. నివర్ తుఫానుగా దీనికి పేరుపెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్త, ఉత్తరకోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారింది. అది నేడు నివర్ తుఫానుగా మారింది. ఈ వాయుగుండం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ […]

దూసుకొస్తున్న నివర్ తుఫాను... ఏపీలో హై అలర్ట్
X

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. నివర్ తుఫానుగా దీనికి పేరుపెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్త, ఉత్తరకోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారింది. అది నేడు నివర్ తుఫానుగా మారింది. ఈ వాయుగుండం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో పుదుచ్చెరికి తూర్పు ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

నివర్ తుఫాను నవంబర్ 25 (బుధవారం) తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో చాలా ఉదృతంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నది. ఆ సమయంలో భారీ వర్షాలు కూడా కురుస్తాయని, సముద్రంలోనికి ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

నివర్ తుఫాను ప్రభావం ఏపీపైకూడా ఉండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

First Published:  24 Nov 2020 12:39 AM GMT
Next Story