Telugu Global
National

ప్రశ్నించే గొంతులను గెలిపించండి... కాంగ్రెస్ కి ఒక్క అవకాశమివ్వండి " రేవంత్ పిలుపు

దుబ్బాక ఫలితం అనంతరం కాంగ్రెస్​ శ్రేణులు కొంత ఢీలా పడ్డా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ పార్టీ అగ్ర నాయకుల్లో కొందరు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతుండగా… మరో వైపు మిగతా నాయకులు పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుదోగ్గ స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దుబ్బాక ఫలితంతో బీజేపీ జోరు మీద ఉండగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి తమ బలం చూపేందుకు […]

ప్రశ్నించే గొంతులను గెలిపించండి... కాంగ్రెస్ కి ఒక్క అవకాశమివ్వండి  రేవంత్ పిలుపు
X

దుబ్బాక ఫలితం అనంతరం కాంగ్రెస్​ శ్రేణులు కొంత ఢీలా పడ్డా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ పార్టీ అగ్ర నాయకుల్లో కొందరు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతుండగా… మరో వైపు మిగతా నాయకులు పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుదోగ్గ స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దుబ్బాక ఫలితంతో బీజేపీ జోరు మీద ఉండగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి తమ బలం చూపేందుకు తహ తహ లాడుతోంది. ఈ రెండు పార్టీలను ఢీ కొనడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్​ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు అధికార పార్టీ కూడా దుబ్బాక ఫలితాలను గుణపాఠంగా తీసుకున్నట్టున్నది. ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ హైదరాబాద్​లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

రేవంత్​రెడ్డి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి పట్టుదలతో కృషిచేస్తున్నారు. ప్రచారంలో అధికార టీఆర్​ఎస్​పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బల్దియాలో ప్రతిపక్షాల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని, లేకపోతే కనీసం 30 సీట్లు అయినా ఇవ్వాలని కోరారు. తమకు అవకాశం ఇస్తే జీహెచ్ఎంసీలో అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితులు వస్తాయని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, అది ఎంత మాత్రం వాస్తవం కాదన్నారు. గత 20 ఏళ్ల కాలంలో ఏనాడైనా హైదరాబాద్ లో కర్ఫ్యూ వచ్చిందా.. అని రేవంత్ ప్రశ్నించారు

కేటీఆర్​ మాయమాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 67 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పడం పచ్చి అబద్ధమని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరానికి ఖర్చుపెట్టింది ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో ఒక్క నిజం ఉన్నా 500 రూపాయలు రిటర్న్ ఇస్తానంటూ రేవంత్ సెటైర్ వేశారు. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామన్న టిఆర్ఎస్ పార్టీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత నాలాల కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి…. వందేళ్లలో జరిగిన ఆక్రమణలు కేసీఆర్ వచ్చిన ఆరేళ్లల్లో జరిగాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

గులాబీ నాయకులను ఇప్పుడు వదిలేస్తే మళ్లీ ఐదేళ్ల వరకు దొరకరు.. అంటూ ఎద్దేవా చేశారు. అందుకే సమస్యలపై పోరాడే నాయకులకు మద్దతు ఇవ్వాలని.. ప్రశ్నించే గొంతులను గెలిపించాలని రేవంత్ ప్రజలను కోరారు.

First Published:  23 Nov 2020 10:07 PM GMT
Next Story