Telugu Global
Cinema & Entertainment

250 కోట్ల ఆఫర్ కు నో చెప్పాడు

బిజినెస్ పరంగా సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అతడి సినిమా మొదటి 3 రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక.. శాటిలైట్స్ డీల్ కింద ఒకేసారి 1000 కోట్ల రూపాయలు అందుకున్న ఘనత కూడా సల్మాన్ కు ఉంది. ఇప్పుడీ హీరో వద్దకు మరో బడా ఆఫర్ వచ్చింది. అయితే దాన్ని సల్మాన్ రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం రాధే అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ […]

250 కోట్ల ఆఫర్ కు నో చెప్పాడు
X

బిజినెస్ పరంగా సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అతడి సినిమా మొదటి 3 రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక.. శాటిలైట్స్ డీల్ కింద ఒకేసారి 1000 కోట్ల రూపాయలు అందుకున్న ఘనత కూడా సల్మాన్ కు ఉంది. ఇప్పుడీ హీరో వద్దకు మరో బడా ఆఫర్ వచ్చింది. అయితే దాన్ని సల్మాన్ రిజెక్ట్ చేశాడు.

ప్రస్తుతం రాధే అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది డిస్నీ. ఓ సినిమా డిజిటల్ కోసం ఇంత ఎమౌంట్ ఆఫర్ చేయడం ఇండియాలో ఇదే తొలిసారి. అయితే ఈ ఆఫర్ ను సల్మాన్ ఖాన్ రిజెక్ట్ చేశాడు. దీనికి ఓ రీజన్ ఉంది.

రాధే సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ థియేటర్లు తెరుస్తున్నారు కాబట్టి రిలీజ్ కు ఇబ్బంది లేదు. థియేట్రికల్ తో పాటు సమాంతరంగా ఓటీటీలో రిలీజ్ చేసే ప్రతిపాదన తీసుకొచ్చింది డిస్నీ. అందుకే 250 కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఈ ప్రతిపాదనకు సల్మాన్ నో చెప్పాడు. థియేట్రికల్ తో పాటు ఓటీటీలో రిలీజ్ చేస్తే.. థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోతుంది. సినిమాకు వసూళ్లు తగ్గిపోతాయి.

First Published:  24 Nov 2020 7:50 AM GMT
Next Story